Begin typing your search above and press return to search.

ఆ స్టార్ హీరో న్యూలుక్ ఏంటి సార్ ఈ ట్విస్ట్!

ఇటీవ‌లే త‌ల‌ప‌తి విజ‌య్ న‌టించిన `ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్` భారీ అంచ‌నాల మ‌ధ్య ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   6 Sep 2024 7:46 AM GMT
ఆ స్టార్ హీరో న్యూలుక్ ఏంటి సార్ ఈ ట్విస్ట్!
X

ఇటీవ‌లే త‌ల‌ప‌తి విజ‌య్ న‌టించిన `ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్` భారీ అంచ‌నాల మ‌ధ్య ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. కోలీవుడ్ లో నే ఆల్ టైమ్ గ్రేట్ హీరోగా ఈసినిమాతో విజ‌య్ స‌రికొత్త రికార్డులు న‌మెదు చేస్తాడ‌ని ఆశిస్తే బాక్సాఫీస్ అంత వేగం క‌నిపించ‌లేదు. సినిమాకి తొలి షోతోనే డివైడ్ టాక్ వ‌చ్చింది. త‌ల‌ప‌తి ఇమేజ్ తో న‌డ‌వ‌డం త‌ప్ప సినిమాలో మ్యాట‌ర్ లేద‌ని మెజార్టీ వ‌ర్గం అభిప్రాయ‌ప‌డింది.

అదంతా ప‌క్క‌న బెడితే విజ‌య్ రాజ‌కీయ పార్టీ స్థాపించి 2026 ఎన్నిక‌ల‌కు వెళ్తోన్న స‌మ‌యంలో ఈ ఫ‌లితం షాకింగ్ అనే చెప్పాలి. హిట్ తో రెట్టించిన ఉత్సాహంతో పొలిటిక‌ల్ బ‌రిలోకి దిగుతాడ‌ని అభిమాను ఆశించారు. కానీ ఇక్క‌డ సీన్ రివ‌ర్స్ లో క‌నిపిస్తోంది. అయితే విజ‌య్ న్యూలుక్ ఒక‌టి నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఇందులో విజ‌య్ ట్రాన్స‌ప‌ర్మేష‌న్ మ‌రింత ఆక‌ట్టుకుంటుంది.

మునుప‌టి కంటే యంగ్ లో లుక్ లో క‌నిపిస్తున్నాడు. మీసాలు తీసేసి స్మార్ట్ లుక్ క‌నిపిస్తున్నాడు. కానీ గెడ్డం మాత్రం పుల్ గా ఉంది. అలాగే హెయిర్ స్టైల్ కూడా డిఫ‌రెంట్ గా ఉంది. మ‌ధ్య‌లో నెరిసిన వెంట్రుక‌లు చూడొచ్చు. ఈ మ‌ధ్య కాలంలో విజ‌య్ మీసాలు తీసింది లేదు. దీంతో ఇది కొత్త సినిమా కోసం అంటూ ప్ర‌చారం ఊపందుకుంది. మ‌రి సినిమా కోసమా? లేక గోట్ లుక్ నా? అన్న‌ది తెలియాల్సి ఉంది.

ఎందుకంటే గోట్ కోసం చాలా లుక్స్ తీసుకున్నారు. వాటిలో కొన్నింటిని రిలీజ్ కి ముందు రిలీజ్ చేసారు. తాజాగా రిలీజ్ అనంత‌రం ప్ర‌చారంలో భాగంగా ఇలా కొత్త ఫోటోలు వ‌దులుతున్నారా? అన్న‌ది తెలియాలి. అయితే విజ‌య్ త‌దుప‌రి సినిమా చేస్తున్నాడా? లేదా? అన్న‌ది మిస్ట‌రీ. హెచ్. వినోధ్ తో ఓ సినిమా చేస్తున్న‌ట్టు ప్ర‌చారంలో ఉంది. కానీ దాన్ని ఇంకా ధృవీక‌రించ‌లేదు.