Begin typing your search above and press return to search.

విజయ్.. పాలిటిక్స్ లో ఇది సాధ్యమేనా?

కోలీవుడ్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే నటుడిగా ఇళయదళపతి విజయ్ ఉన్నారు.

By:  Tupaki Desk   |   14 Sep 2024 4:36 AM GMT
విజయ్.. పాలిటిక్స్ లో ఇది సాధ్యమేనా?
X

కోలీవుడ్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే నటుడిగా ఇళయదళపతి విజయ్ ఉన్నారు. ఆయన సినిమాలు కూడా చాలా ఈజీగా 200 కోట్ల కలెక్షన్స్ ని అందుకుంటుంది. మూవీ డిజాస్టర్ అయిన కూడా 200-300 కోట్ల కలెక్షన్స్ సాధించగలిగే ఏకైక హీరోగా సౌత్ లో దళపతి విజయ్ ఉన్నారు. తాజాగా రిలీజ్ అయిన GOAT మూవీ తప్ప ఈ మధ్యకాలంలో ఆయన నుంచి వచ్చిన సినిమాలు అన్ని కూడా కమర్షియల్ సక్సెస్ అందుకున్నాయి. అయితే తమిళ్ రాజకీయాలలోకి విజయ్ అడుగుపెట్టారు. దీంతో సినిమాలు మానేస్తున్నట్లు విజయ్ ప్రకటించారు.

తమిళనాడులో మొదటి నుంచి ప్రాంతీయ పార్టీల హవా నడుస్తూ ఉంటుంది. అలాగే అక్కడ రాష్ట్రాన్ని రూల్ చేసిన ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత సినిమా చరిష్మాతోనే తరువాత రాజకీయాలలో నాయకులుగా ఎదిగారు. అందుకే అక్కడ సినిమాలకి, రాజకీయాలకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. స్టార్ హీరో విజయ్ కాంత్ రాజకీయ పార్టీ పెట్టిన ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు. ప్రస్తుతం అయితే తమిళనాడు రాజకీయాలలో పొలిటికల్ స్పేస్ ఉంది.

డిఎంకే పార్టీలో స్టాలిన్ మాత్రమే ఇప్పుడు రాష్ట్రంలో చరిష్మటిక్ లీడర్ గా కనిపిస్తున్నారు. అపోజిషన్ లీడర్ పొజిషన్ ని భర్తీ చేసే నాయకత్వం అక్కడ లేదు. ఇప్పుడు ఆ స్పేస్ ని ఇళయదళపతి విజయ్ తీసుకోవడానికి రెడీ అవుతున్నాడు. దీనికోసం సినిమాలు పూర్తిగా వదలేసి రానున్న అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ చేయాలని విజయ్ భావిస్తున్నారు. ఇప్పటికే ఆయన రాజకీయ పార్టీ గుర్తింపు కూడా లభించింది. విజయ్ ఇంకొక్క సినిమా మాత్రమే చేస్తానని చెప్పారు. హెచ్ వినోత్ దర్శకత్వంలో మూవీ ఇప్పటికే కన్ఫర్మ్ అయిపొయింది. త్వరలో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది.

దీని తర్వాత పూర్తిగా సినిమాలకి ఫుల్ స్టాప్ పెడతానని చెప్పారు. అయితే ఇది సాధ్యమవుతుందా అంటే చెప్పలేమనే మాట వినిపిస్తుంది. ఎంజీఆర్, ఎన్టీఆర్ రాజకీయాలలోకి వెళ్లిన తర్వాత కూడా కొంతకాలం గ్యాప్ తీసుకున్న మరల కొన్ని సినిమాలు చేశారు. అలాగే తెలుగునాట మెగాస్టార్ చిరంజీవి సినిమాలకి స్వస్తి చెప్పి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి రాజకీయాలు చేశారు. 10 ఏళ్ళ తర్వాత మరల తిరిగి పునరాగమనం చేశారు. తమిళనాట కమల్ హాసన్ కూడా రాజకీయ పార్టీ పెట్టి కొంతకాలం సినిమాలకి గ్యాప్ ఇచ్చారు. మరల తిరిగి సినిమాలు స్టార్ట్ చేశారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ స్థాపించిన తర్వాత అజ్ఞాతవాసి చివరి సినిమా అని ప్రకటించారు. మరల మూవీస్ చేయనని చెప్పారు. అయితే వకీల్ సాబ్ సినిమాతో పునరాగమనం చేశారు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. విజయ్ కూడా రాజకీయాలలోకి అడుగుపెట్టిన తర్వాత ఓ రెండు, మూడేళ్లు సినిమాలకి దూరంగా ఉండొచ్చు. ఒక వేళ గెలిచి అధికారంలోకి వస్తే సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టే ఛాన్స్ ఉంటుంది. లేదంటే తిరిగి రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. రాజకీయ పార్టీని నడపాలంటే కోట్ల రూపాయిలు ఖర్చవుతుంది. దానికోసం అయిన మరల విజయ్ సినిమాలు చేసే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. రెండేళ్లలో రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో విజయ్ పార్టీ ఏ మేరకు సత్తా చాటుతుంది అనేది ఆయన సినీ కెరియర్ ని డిసైడ్ చేస్తుందనే మాట వినిపిస్తోంది.