Begin typing your search above and press return to search.

గేమ్ చేంజర్.. అసలు చాలెంజ్ వారిద్దరికే..

ఎట్టకేలకి ‘గేమ్ చేంజర్’ బజ్ మొదలైంది. మ్యూజిక్ డైరెక్టర్ థమన్, దర్శకుడు శంకర్ ఈ సినిమాను పబ్లిక్‌లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు.

By:  Tupaki Desk   |   29 Sep 2024 3:50 AM GMT
గేమ్ చేంజర్.. అసలు చాలెంజ్ వారిద్దరికే..
X

ఎట్టకేలకి ‘గేమ్ చేంజర్’ బజ్ మొదలైంది. మ్యూజిక్ డైరెక్టర్ థమన్, దర్శకుడు శంకర్ ఈ సినిమాను పబ్లిక్‌లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. అందులో భాగంగా, ఇప్పటికే ఇద్దరూ కలిసి ఓ ఇంటర్వ్యూ లాంటి వీడియో విడుదల చేశారు. అలాగే ‘గేమ్ చేంజర్’ సెకండ్ సింగిల్ రిలీజ్‌ను కూడా అనౌన్స్ చేశారు. ఈ సాంగ్ అనౌన్స్‌మెంట్ సోషల్ మీడియాలో షేర్ చేసి, మూవీపై కొంత బజ్ క్రియేట్ చేశారు.

ముఖ్యంగా థమన్ అయితే ‘గేమ్ చేంజర్’ ద్వారా పాన్-ఇండియా రేంజ్‌లో తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ది బెస్ట్ ఆల్బమ్‌ను సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కానీ, ‘గేమ్ చేంజర్’ నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ మాత్రం ఫ్యాన్స్‌కి ఆశించిన స్థాయిలో కిక్ ఇవ్వలేదు. అందుకే, కచ్చితంగా సెకండ్ సింగిల్‌తో జోష్ పెంచాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. ‘రా మచ్చా’ అనే సాంగ్‌ను సెకండ్ సింగిల్‌గా విడుదల చేయబోతున్నారు.

ఈ సాంగ్‌పై ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. శంకర్ ఈ సాంగ్‌ను చాలా గ్రాండియర్‌గా డిజైన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. తాజాగా సాంగ్ ప్రోమో వచ్చింది. ఈ ప్రోమో కొంతవరకు ఫ్యాన్స్‌కి చేరువైంది. కానీ, పూర్తి సాంగ్ వస్తేనే అది ఏ మేరకు సౌండ్ క్రియేట్ చేస్తుందనేది స్పష్టత వస్తుంది. సినిమాపై హైప్ పెరగాలంటే ఈ సాంగ్ సూపర్ హిట్ కావాల్సిందే. ‘దేవర’ సినిమాకి అనిరుద్ కంపోజ్ చేసిన సాంగ్స్‌పై కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ పబ్లిక్‌లో బలంగా వెళ్లాయి.

అలాగే, దర్శకుడిగా కొరటాల కూడా ‘దేవర’తో గ్రాండ్ ఓపెనింగ్స్ అయితే అందుకున్నాడు. ఇప్పుడు ‘గుంటూరు కారం’ ఫెయిల్యూర్‌తో ఉన్న థమన్‌కు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ‘గేమ్ చేంజర్’ మంచి అవకాశం. అలాగే ‘భారతీయుడు 2’తో డిజాస్టర్ అందుకున్న శంకర్‌కి కూడా ‘గేమ్ చేంజర్’ కెరీర్ పరంగా డూ ఆర్ డై లాంటి మూవీ. ఈ సినిమా సక్సెస్ అయితే, శంకర్ మరలా బలంగా నిలబడతారు.

ఈ నేపథ్యంలో, ‘గేమ్ చేంజర్’ మీద ఉన్న టెన్షన్ అంతా ఇప్పుడు శంకర్, థమన్ మీదనే ఉందని వినిపిస్తోంది. రాబోయే సాంగ్స్‌తో వీరు సినిమాని స్ట్రాంగ్‌గా పబ్లిక్‌లోకి తీసుకెళ్లగలిగితే హైప్ మరింత పెరుగుతుంది. అప్పుడు సినిమాకి మంచి బిజినెస్ కూడా జరుగుతుంది. ఈ విషయంలో థమన్, శంకర్ ఎంత మేరకు ప్రూవ్ చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ‘దేవర’తో ఎన్టీఆర్ ఆల్ మోస్ట్ పాన్-ఇండియా స్టార్‌గా నిలిచినట్లే. ఇక ‘గేమ్ చేంజర్’తో రామ్ చరణ్ ఎంత మేరకు మార్కెట్ క్రియేట్ చేసుకుంటాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.