బైరవ ద్వీపానికి డ్రమ్స్ వాయించిన తమన్!
ఇప్పటికే బాలయ్య నటించిన ఐదు సినిమాలకు తానే సంగీతం అందించాడు.
By: Tupaki Desk | 23 Jan 2025 6:19 AM GMTథమన్ ఇప్పుడు ఎంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అన్నది చెప్పాల్సిన పనిలేదు. స్టార్ హీరోల చిత్రాలన్నంటికి తానే సంగీత దర్శకుడవుతున్నాడు. కొంత కాలంగా తమన్ మేనియా ఇండస్ట్రీలో కొనసాగుతుంది. ముఖ్యంగా నటసింహ బాలకృష్ణ కాంపౌడ్ లో ఆస్థాన సంగీత దర్శకుడిగా మారిపోయారు. ఇప్పటికే బాలయ్య నటించిన ఐదు సినిమాలకు తానే సంగీతం అందించాడు. అన్నీ బ్లాక్ బస్టర్లే అయ్యాయి.
దీంతో తమన్ ఇంటి పేరు కూడా మారిపోయింది. నందమూరి తమన్ అంటూ పిలవడం మొదలు పెట్టారు. తాజాగా బాలయ్య కూడా ఎన్బీకే తమన్ అంటూ కొత్తగా పిలవడం మొదలు పెట్టారు. ఎందుకో బాలయ్యకు-తమన్ కి అలా సెట్ అయింది. వాళ్ల అభిరుచులు కలిసాయి. తమన్ బాలయ్యపై చూపించే ప్రత్యేకమైన ప్రేమకు మరింత కనెక్ట్ అయ్యారు. పెద్దలంటే తమన్ ఇచ్చే గౌరవానికి బాలయ్య ఫిదా అయిపోయారు.
అయితే బాలయ్య తో తమన్ ప్రయాణం ఈనాటిది కాదు. కొన్ని దశాబ్ధాల క్రితమే ప్రారంభమైందన్న సంగతి తమన్ ఆలస్యంగా రివీల్ చేసాడు. బాలకృష్ణ కథానాయకుడిగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన `భైరవ ద్వీపం` ప్పట్లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమాకి మాదవ పెద్ద సురేష్ సంగీతం అందిం చారు. మ్యూజికల్ గా ఈ సినిమా అతి పెద్ద సంచలనం. ఇప్పటికీ బైరవ ద్వీపం పాటలు వినిపిస్తూనే ఉంటాయి.
మళ్లీ అలాంటి పాటలు పుట్టాలంటే? మాదవ పెద్దతో మాత్రమే సాధ్యమవుతుందనిపిస్తుంది. అయితే ఈ సినిమా సంగీతంలో థమన్ కూడా భాగస్వామే. ఈ సినిమాకు తమన్ అప్పట్లో డ్రమ్స్ వాయించాడుట. అందుకు గాను రోజుకు 30 రూపాయలు పారితోషికం తీసుకున్నాడు. ఎన్ని రోజులు వాయిస్తే అన్ని 30 లు ఇచ్చి తనని సంతోష పెట్టేవారని తమన్ అన్నాడు. ఇప్పుడదే తమన్ బాలయ్యతో కలిసి ఐదు సినిమాలకు పనిచేసాడు. బైరవ ద్వీపంతో మొదలైన ప్రయాణం ఇంత దూరం వస్తుందనుకోలేదని తమన్ అన్నాడు.