గేమ్ ఛేంజర్.. స్పీడ్ పెంచే పనిలో తమన్!
కానీ టీజర్ వచ్చిన తర్వాత అభిమానుల్లో కొంత నమ్మకం అయితే పెరిగింది.
By: Tupaki Desk | 21 Nov 2024 4:41 AM GMTరామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్ లో సిద్దమవుతున్న బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ మళ్ళీ ట్రాక్ లోకి వస్తోంది. మళ్ళీ పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. మొన్నటి వరకు ఈ సినిమా అసలు హైప్ తెస్తుందా లేదా అనే అనుమానాలు కూడా ఉండేవి. కానీ టీజర్ వచ్చిన తర్వాత అభిమానుల్లో కొంత నమ్మకం అయితే పెరిగింది. తప్పకుండా శంకర్ తన సరికొత్త మేకింగ్ విధానంతో ఆకట్టుకుంటాడు అని నమ్ముతున్నారు.
ఇక సినిమా ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచాల్సిన టైమ్ అయితే వచ్చేసింది. టీజర్ తర్వాత మళ్ళీ కాస్త సైలెంట్ అయినట్లు కనిపిస్తున్నారు. అయితే మరోవైపు తమన్ మాత్రం తన డ్యూటీ పర్ఫెక్ట్ గానే కొనసాగిస్తున్నాడు. సినిమాకు సాంగ్స్ తోనే ఇంకా హై రేంజ్ లో మైలేజ్ రావాల్సి ఉంది. ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి. ఇక రాబోయే రోజుల్లో మరొక క్రేజ్ సాంగ్ రానుంది. ఫ్యాన్స్ కోరుకునే అప్డేట్స్ కూడా రానున్నట్లు తమన్ సోషల్ మీడియా ద్వారా ఒక మంచి జోష్ అయితే నింపుతున్నాడు.
ఇక సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కూడా ఎక్కువగా అప్డేట్స్ కోసం తమన్ నే అడుగుతు ఉన్నారు. గేమ్ ఛేంజర్ బ్లాస్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది అంటూ తమన్ రీసెంట్ గా ఒక ట్వీట్ అయితే చేశాడు. అంతేకాకుండా 22వ తేదీన పోస్టర్, 25వ తేదీన ప్రోమో కూడా రాబోతోంది అని ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. అంతేకాకుండా 27వ తేదీన మరో సాంగ్ రాబోతోంది అని ఫైనల్ గా ఫ్యాన్స్ కు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పాడు.
ఈసారి వచ్చే సాంగ్ మాత్రం మెలోడీ తరహాలో ఉంటుంది అని మిమ్మల్ని అందరిని కూడా ఒక డిఫరెంట్ వరల్డ్ లోకి తీసుకువెళ్తుందని తెలియజేశాడు. ఇక ఈ సాంగ్ మేకింగ్ కూడా చాలా కొత్తగా ఉంటుందని శంకర్ సార్ దృశ్యరూపం అద్భుతంగా ఉంటుంది అని పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాడు. అంతేకాకుండా ఆ సాంగ్ తన మైలేజ్ ను ఇంకా పెంచుతుందని వివరణ ఇచ్చాడు.
దీంతో రాబోయే సాంగ్ మాత్రం తప్పకుండా ఫాన్స్ కు మంచి కిక్ ఇవ్వబోతోందని తమన్ అయితే నమ్మకాన్ని కలిగిస్తూ ఉన్నాడు. గేమ్ ఛేంజర్ సినిమా 2025 జనవరి 10వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. దిల్ రాజు తన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరోవైపు వెంకటేష్ తో నిర్మించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాను కూడా దిల్ రాజు సంక్రాంతికి విడుదల చేస్తున్నారు. బాలకృష్ణ డాకూ మహారాజ్ నైజాం రైట్స్ కూడా ఆయనే సొంతం చేసుకోవడం విశేషం.