Begin typing your search above and press return to search.

ఓజీ, గేమ్ ఛేంజ‌ర్ బీజీఎమ్ వేరే లెవ‌ల్లో!

మ్యూజిక్ డైరెక్ట‌ర్ థ‌మ‌న్ సంగీతం ప‌రంగా కొత్త‌గా ట్రై చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   30 Sep 2024 4:54 AM GMT
ఓజీ, గేమ్ ఛేంజ‌ర్ బీజీఎమ్ వేరే లెవ‌ల్లో!
X

మ్యూజిక్ డైరెక్ట‌ర్ థ‌మ‌న్ సంగీతం ప‌రంగా కొత్త‌గా ట్రై చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. పాట‌ల్లో శ్రుతి మించిన డ్ర‌మ్స్ వాయింపుడు తగ్గించి కొత్త‌గా బాణీలు స‌మ‌కూర్చుతున్నాడు. సంగీతం ప‌రంగా తిరుగులేదు. హిట్ ఆల్బ‌మ్ లు ఎన్నో అందించాడు. ఇక ఆర్ ఆర్ ఇవ్వ‌డంలో థ‌మ‌న్ స్పెష‌లిస్ట్ అని చెప్పాల్సిన ప‌నిలేదు. ఆ విష‌యంలో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాడు. `ఆర్ ఆర్ ఆర్` తో ఎన్నో సినిమాల్ని పైకి లేపాడు.

అదే ఇమేజ్ తో ఎంతో మంది సంగీత ద‌ర్శ‌కుల్నిసైతం రేసు నుంచి ప‌క్క‌కు నెట్టి ముందుకొచ్చాడు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా ఓ వెలుగు వెలుగుతున్నాడు. గేమ్ ఛేంజర్ కోసం శంక‌ర్ ఏరికోరి మ‌రీ థ‌మ‌న్ ఎంచుకున్నారు? అంటేనే అర్దం చేసుకోవ‌చ్చు. ఇప్ప‌టికే గేమ్ ఛేంజ‌ర్ నుంచి రిలీజ్ అయిన లిరిక‌ల్ సింగిల్స్ శ్రోత‌ల్ని అల‌రిస్తున్నాయి. ఇక ఆర్ ఆర్ ఎలా ఉంటుంద‌న్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు.

శంక‌ర్ విజ‌న్ కి థ‌మ‌న్ బీజీఎమ్ తోడైతే అరుపులే. మ‌రోవైపు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తోన్న `ఓజీ` సినిమాకి థ‌మ‌న్ సంగీతం అందిస్తోన్న సంగ‌తి తెలిసిందే. గ్యాంగ్ స్ట‌ర్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కుతోన్న సినిమా ఇది. ఇలాంటి సినిమాకి ఆర్ ఆర్ కీల‌కం. థ‌మ‌న్ కాబ‌ట్టి చూసుకునే ప‌నిలేదు. ప‌వ‌న్ ఎలివేష‌న్ స‌న్నివేశాలు గానీ....సినిమా మొత్తం బీబీఎమ్ గానీ హైలైట్ గా ఉంటాయి.

పాట‌ల్లోనూ థ‌మ‌న్ మార్క్ క‌నిపిస్తుంది. `ఓజి` నుంచి పవన్ క‌ళ్యాణ్ బర్త్ డే కే ఓ సాంగ్ రావాలి. కానీ రిలీజ్ అవ్వ‌లేదు. ఉంది కానీ రాలేదు. ఆ పాట‌పై మంచి అంచ‌నాలున్నాయి. తాజాగా ఓజీ, గేమ్ ఛేంజ‌ర్ మ్యూజిక్ ని ఉద్దేశించి త‌మ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. `భీమ్లా నాయక్` మాస్ స్కోర్ పై రిప్లై ఇస్తూ? ఇదేం ఉంది బాస్. `ఓజి`, `గేమ్ ఛేంజర్` లకు ఇవ్వబోయే బీజీఎమ్ హై లెవెల్లో ఉంటుంది. వెయిట్ చెయ్యండి` అని అంటున్నాడు. ప్ర‌స్తుతం ఈ కామెంట్ అభిమానుల్లోవైర‌ల్ గామారింది. అబ్బాయ్.. బాబాయ్ సినిమాల‌కు థ‌మ‌న్ పోటీ ప‌డి మ‌రీ సంగీతం అందిస్తున్నాడ‌ని గెస్ చేస్తున్నారు.