Begin typing your search above and press return to search.

థమన్ మెగా సౌండ్.. మామూలుగా లేదు

టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లలో ఒకరైన థమన్ తెలుగులో చివరిగా ‘గుంటూరు కారం’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు

By:  Tupaki Desk   |   1 Oct 2024 8:25 AM GMT
థమన్ మెగా సౌండ్.. మామూలుగా లేదు
X

టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లలో ఒకరైన థమన్ తెలుగులో చివరిగా ‘గుంటూరు కారం’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమాలో సాంగ్స్ తో తెలుగు ఆడియన్స్ ని బాగానే ఎంటర్టైన్ చేశాడు. ముఖ్యంగా కుర్చీ పడతపెట్టి సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే. కమర్షియల్ సినిమాల నుంచి ప్రేక్షకుల ఎలాంటి ఎనర్జిటిక్ సాంగ్స్ ఎక్స్ పెక్ట్ చేస్తారో థమన్ అలాంటివాటిని అందిస్తూ ఉంటాడు. అందుకే థమన్ సాంగ్స్ తెలుగులో ఎక్కువగా బ్లాక్ బస్టర్ అవుతాయి. అలాగే సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ సెట్ చేస్తాయి.

స్టార్ హీరోలు కూడా కమర్షియల్ జోనర్ మూవీస్ కోసం థమన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే థమన్ నుంచి ఇప్పటి వరకు ఒక్క పాన్ ఇండియా మూవీ రాలేదు. పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కి థమన్ ఏ రేంజ్ మ్యూజిక్ అందించి దేశవ్యాప్తంగా ప్రేక్షకులని ఎట్రాక్ట్ చేయగలడో చూడాలనే క్యూరియాసిటీ అందరిలో ఉంది. ‘పుష్ప’తో దేవిశ్రీ ప్రసాద్ ప్రూవ్ చేసుకున్నారు. ‘జైలర్’, ‘లియో’, ‘దేవర’ మూవీస్ తో అనిరుద్ తనదైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు.

ఇప్పుడు థమన్ చేతిలో మూడు పాన్ ఇండియా సినిమాలున్నాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’, డార్లింగ్ ప్రభాస్ ‘ది రాజాసాబ్’, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమాలకి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ మూడు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సినిమాలే కావడం విశేషం. ఈ మూడు దేనికవే ప్రత్యేకమైనవి. వీటిలో ముందుగా రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ మూవీ రిలీజ్ కాబోతోంది. డిసెంబర్ 20న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తామని దిల్ రాజు ప్రకటించారు. దానికి తగ్గట్లుగానే ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ‘గేమ్ చేంజర్’ నుంచి సెకండ్ సింగిల్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. రా మచ్చ మచ్చ అంటూ సాగే ఈ సాంగ్ కి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. విజువలైజేషన్ మాత్రం గ్రాండ్ గా ఉండబోతోందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ‘భీమ్లా నాయక్’ మూవీ థియేటర్ సెలబ్రేషన్స్ కి సంబందించిన వీడియోని పవర్ స్టార్ అభిమాని థమన్ కి టాగ్ చేశారు. ‘భీమ్లా నాయక్’ కి థమన్ అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు.

ఫ్యాన్ పెట్టిన భీమ్లా నాయక్ వీడియో ట్వీట్ కి థమన్ రిప్లయ్ ఇచ్చాడు. గేమ్ చేంజర్, ఓజీ సినిమాలలో అంతకు మించి హైలో బ్యాగ్రౌండ్ స్కోర్ ఉంటుందని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. థమన్ ట్వీట్ పై మెగా అభిమానులు అయితే చాలా హ్యాపీగా రియాక్ట్ అవుతున్నారు. సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేస్తోన్న పాన్ ఇండియా మూవీ ఓజీ పైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమాకి బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా కీలకం అని చెప్పొచ్చు. ఇప్పటికే ఓజీ నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ తో తమన్స్ ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యాడు. మరి థమన్ ఈ మూవీకి ఏ రేంజ్ అవుట్ ఫుట్ ఇస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.