Begin typing your search above and press return to search.

తమన్.. సడెన్ గా ఈ పోస్ట్ ఏంటి?

టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. చేతి నిండా ప్రాజెక్టులతో బిజీబిజీగా గడుపుతున్నారు.

By:  Tupaki Desk   |   4 Sep 2024 6:12 PM GMT
తమన్.. సడెన్ గా ఈ పోస్ట్ ఏంటి?
X

టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. చేతి నిండా ప్రాజెక్టులతో బిజీబిజీగా గడుపుతున్నారు. తన ట్యూన్స్ తో అలరిస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ అల వైకుంఠపురములో సినిమాతో థమన్ రేంజ్ వేరే లెవెల్ పెరిగిందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. 2020లో దాదాపు 10 సినిమాలకు వర్క్ చేసిన ఆయన.. అప్పటి నుంచి వరుస అవకాశాలు అందుకుంటున్నారు. ప్రస్తుతం మూడు చిత్రాలకు వర్క్ చేస్తున్నారు.

రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, పవన్ కళ్యాణ్ ఓజీ, సిద్ధూ జొన్నలగడ్డ తెలుసు కదా సినిమాలకు సంగీతాన్ని అందిస్తున్నారు. మరిన్ని ప్రాజెక్టులను లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. తాజాగా తమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నెగిటివ్ కామెంట్స్ చేసే వారి గురించి మాట్లాడారు. అసభ్యకరమైన కామెంట్స్ చేయడం వల్ల ఉపయోగం ఏంటని ప్రశ్నించారు. నెగిటివ్ ట్రెండ్స్ వల్ల ఏమైనా లాభం ఉందా అసలు అని అన్నారు. అలాంటి వాటి వల్ల మూవీపై ఎఫెక్ట్ పక్కాగా పడుతుందని చెప్పారు.

నెగిటివ్ కామెంట్స్, ట్రెండ్స్ వల్ల మూవీ గొప్పతనం కచ్చితంగా దెబ్బతింటుందని తమన్ అభిప్రాయపడ్డారు. అవి సినిమాకు ఉన్న ఇమేజ్ ను తీవ్రంగా దెబ్బతీస్తాయని తెలిపారు. తాను వర్క్ చేస్తున్న ఓ మూవీని ఉద్దేశిస్తూ.. తమ టెక్నికల్ టీమ్ మంచి కంటెంట్ ను సినీ ప్రియులకు అందించేందుకు రెండేళ్లుగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. అయితే అభిమానులకు ఓ విషయంలో రిక్వెస్ట్ చేస్తున్నట్లు చెప్పారు. తమకు ఫుల్ గా పాజిటివ్ ఎనర్జీ అందించాలని కోరారు.

షూటింగ్ టైమ్ లో తాము ఎలాంటి ఎక్స్పీరియన్స్ పొందామో.. మీకు(సినీ ప్రియులు) అలాంటి ఆనందాన్నే ఇచ్చేందుకు గట్టిగా ట్రై చేస్తున్నట్లు తెలిపారు తమన్. ప్రొడ్యూసర్స్, యాక్టర్స్, టెక్నీషియన్స్ సహా అంతా దీని కోసమే టైమ్ స్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. మేకర్స్ డబ్బులు పెడుతున్నట్లు చెప్పారు. తాము ఫుల్ స్ట్రాంగ్ గా తిరిగొస్తామని ధీమా వ్యక్తం చేశారు. తమ కొత్త అప్డేట్ తో బ్లాస్ట్ క్రియేట్ చేస్తామని చెప్పారు. ఆగస్టు నెలలోనే బిగ్ అప్డేట్ ఉండనున్నట్లు వెల్లడించారు.

ఈ మేరకు సోషల్ మీడియాలో తమన్ పెట్టిన పోస్ట్.. ఇప్పుడు ఫుల్ వైరల్ గా మారింది. గేమ్ ఛేంజర్ మూవీని ఉద్దేశించే ఆయన పోస్ట్ పెట్టి ఉంటారని నెటిజన్లు చెబుతున్నారు. ఎందుకంటే ఆ సినిమా నుంచి చరణ్ బర్త్ డే సందర్భంగా జరగండి జరగండి పాట రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో సాంగ్ విషయంలో విమర్శలు, ట్రోల్స్ వచ్చాయి. అందుకే తమన్ ఇప్పుడు స్పందించినట్లు అనిపిస్తోందని అంటున్నారు. మరి తమన్ చెప్పిన అప్డేట్ ఏంటో తెలియాలంటే వేచి చూడాలి.