పుష్ప 2: తమన్ మ్యూజిక్ వాడలేదు సరే.. మరి ఎంతిచ్చారు?
ఇక దేవి కాకుండా ముగ్గురి నుంచి తీసుకున్న ట్రాక్స్ కోసం భారీ మొత్తంలో ఖర్చు పెట్టడం గమనార్హం.
By: Tupaki Desk | 7 Dec 2024 6:39 AM GMT‘పుష్ప: ది రూల్’ విడుదల అనంతరం మొత్తానికి బాక్సాఫీస్ వద్ద సాలీడ్ కలెక్షన్లతో బాక్సాఫీస్ హిట్ గా దూసుకుపోతోంది. అయితే విడుదలకు అనేక రకాల గాసిప్స్ వైరల్ అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో దేవిశ్రీ ప్రసాద్ పనితీరుపై దర్శకుడు సుకుమార్ తో పాటు బన్నీ పూర్తిగా సంతృప్తి చెందకపోవడంతో ముగ్గురు కొత్త సంగీత దర్శకులను ట్రై చేసినట్లు తేలిపోయింది.
బన్నీ కోరిక మేరకు తమన్ వచ్చి తనకు ఇచ్చిన వర్క్ రెండు వారాల్లో ఫినిష్ చేసి ఇచ్చాడు. ఇక తమిళ సంగీత దర్శకుడు సామ్ సీఎస్ ఇంకాస్త ఎక్కువగా వాడినట్లు తెలుస్తోంది. అలాగే మైత్రి వారి సలహా మేరకు కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్‌నాథ్ ను రంగంలోకి దింపారు. ముగ్గురు కూడా తమకిచ్చిన బాధ్యతను పూర్తి చేసి ట్రాక్స్ అందజేశారు. అయితే మొదట తమన్ వర్క్ సుకుమార్‌కు పూర్తిగా నచ్చకపోవడంతో, ఆయన పని పూర్తిగా పక్కనపెట్టారు.
అజనీష్ వర్క్ కొంత మెప్పించినప్పటికీ, సినిమాలో ఉపయోగించే స్థాయిలో అనిపించలేదట. ఇక చివరకు సామ్ సీఎస్ వర్క్‌ను మాత్రమే వాడారు. సామ్ నేపథ్య సంగీతం ప్రధానంగా పోలీస్ స్టేషన్ సన్నివేశంలో వినిపించడం జరిగింది. అలాగే జాతర ఎపిసోడ్ కు కూడా అతనే BGM ఇచ్చినట్లు చెప్పాడు. ఈ ఎపిసోడ్‌లో పుష్ప పాత్రకు తగిన ఎలివేషన్ ఇవ్వడంలో సామ్ బీజీఎం బాగా ఫిట్ అయింది.
ఇక క్రెడిట్స్ లో దేవితో పాటు సామ్ పేరు కనిపించింది. ఇక సినిమా క్లైమాక్స్‌లో దేవిశ్రీ ప్రసాద్, సామ్ సీఎస్ మధ్య బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో తీవ్ర చర్చలు జరిగాయని తెలుస్తోంది. అయితే చివరికి దర్శకుడు సుకుమార్ దేవి శ్రీ ప్రసాద్ వర్క్‌ను ఎంచుకున్నారని టాక్. ఆల్రెడీ పుష్ప-1లో దేవిశ్రీ అందించిన సంగీతం ఎంత పెద్ద హిట్టో తెలుసు. దాంతో, ఆయనకు ఈ సీక్వెల్‌లో కూడా పూర్తి క్రెడిట్ ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారు. దీని ఆధారంగా సినిమా టైటిల్స్‌లో సంగీత దర్శకుడిగా దేవిశ్రీ పేరును ప్రధానంగా చూపించారు. సామ్ సీఎస్ పేరు మాత్రం అదనపు స్కోర్ విభాగంలో మాత్రమే చూపబడింది.
ఇక దేవి కాకుండా ముగ్గురి నుంచి తీసుకున్న ట్రాక్స్ కోసం భారీ మొత్తంలో ఖర్చు పెట్టడం గమనార్హం. సామ్, తమన్, అజనీష్ ముగ్గురికీ తలో కోటి రూపాయలు ఇచ్చారు. అయితే, తమన్, అజనీష్ ట్రాక్స్ ఉపయోగించకపోయినా కూడా, సరే వారి పనికి తగ్గట్లే పారితోషకం ఇచ్చారట. అదనపు సంగీతం కోసం మొత్తం రూ.3 కోట్లు ఖర్చు చేయడం పెద్ద చర్చగా మారింది. ఇదే సమయంలో, దేవిశ్రీ ప్రసాద్‌కు మ్యూజిక్ మరియు బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం చెల్లించిన మొత్తం కూడా భారీగా ఉంది. గతంలో దేవి, తమన్ ఇద్దరూ మణిశర్మ దగ్గర శిష్యులుగా పని చేశారు, ఇక వారి మధ్య ఉన్న గ్యాప్ ఇప్పుడు మరింత ఎక్కువైనట్లు తెలుస్తోంది.