Begin typing your search above and press return to search.

గేమ్ చేంజర్.. ఒక అప్డేట్ వచ్చేసింది..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న గేమ్ ఛేంజర్ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

By:  Tupaki Desk   |   6 Sep 2024 9:31 AM GMT
గేమ్ చేంజర్.. ఒక అప్డేట్ వచ్చేసింది..
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న గేమ్ ఛేంజర్ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇప్పటికే చరణ్ ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారు. భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే గేమ్ చేంజర్ నుంచి ఇప్పటి వరకు ఒక్క సాంగ్ మాత్రమే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ పాటకి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు.

ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నుంచి పాన్ ఇండియా రేంజ్ లో రాబోతున్న మూవీ కావడంతో మెగా ఫ్యాన్స్ ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. అయితే చెప్పుకోదగ్గ స్థాయిలో ఈ చిత్రంపై హైప్ లేదు. శంకర్ భారతీయుడు 2 మూవీ డిజాస్టర్ ఇంపాక్ట్ కూడా ఈ చిత్రంపై పడింది. ఇదిలా ఉంటే గేమ్ చేంజర్ మూవీ అప్డేట్ గురించి మెగా ఫ్యాన్స్ చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు.

ఆగష్టు నెల ఆఖరులో గేమ్ చేంజర్ సెకండ్ సింగిల్ రిలీజ్ ఉంటుందని గతంలో థమన్ చెప్పారు. అయితే ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో మెగా ఫ్యాన్స్ థమన్ ని ట్విట్టర్ లో ట్యాగ్ చేసి ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా థమన్ గేమ్ చేంజర్ కి సంబంధించిన అప్డేట్ ట్విట్టర్ పోస్ట్ పెట్టారు. గేమ్ చేంజర్ అంటూ పేరు పెట్టి దానికి ఎమోజీలని థమన్ యాడ్ చేశారు. క్రింద హ్యాపీ వినాయక చవితి 2024 అంటూ ట్వీట్ చేశారు.

ఈ పోస్ట్ బట్టి వినాయక చవితికి గేమ్ చేంజర్ నుంచి అదిరిపోయే అప్డేట్ ఉండబోతోందని కన్ఫర్మ్ అయ్యింది. మేగ్జిమమ్ సెకండ్ సింగిల్ కి రిలీజ్ చేయొచ్చని భావిస్తున్నారు. హీరో ఎలివేషన్ తో నడిచే సాంగ్ గా ఈ సెకండ్ సింగిల్ ఉండొచ్చని థమన్ పెట్టిన ఎమోజీల బట్టి అంచనా వేస్తున్నారు. అయితే అది ఎంత వరకు వాస్తవం అవుతుందనేది తెలియాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే.

గేమ్ చేంజర్ చిత్రంలో రామ్ చరణ్ కి జోడీగా కియారా అద్వానీ, అంజలి నటిస్తున్నారు. చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఎస్.జె సూర్య ప్రతినాయకుడిగా చేశారు. శ్రీకాంత్ కీలక పాత్రలో నటించారు. ఇంకా చాలా మంది స్టార్ యాక్టర్స్ గేమ్ చేంజర్ మూవీలో ఉన్నట్లు తెలుస్తోంది. మెగా ఫ్యాన్స్ అయితే గేమ్ చేంజర్ విషయంలో మ్యూజిక్ పరంగా చాలా హోప్స్ పెట్టుకున్నారు.