Begin typing your search above and press return to search.

మీసం తిప్పి మరీ OG పై హైప్ ఎక్కించిన థమన్..!

ఇప్పుడు లేటెస్టుగా మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. థమన్ ఈ సినిమాకి మరింత హైప్ ఎక్కించే అప్డేట్స్ అందించారు.

By:  Tupaki Desk   |   14 Jan 2025 6:35 AM GMT
మీసం తిప్పి మరీ OG పై హైప్ ఎక్కించిన థమన్..!
X

పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా వేచి చూస్తున్న సినిమా "OG". పవన్ కల్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ఇది. ప్రస్తుతం జనసేనాని నటిస్తున్న మూడు చిత్రాల్లో ఎక్కువ హైప్ ఉన్న సినిమా ఇదే. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు లేటెస్టుగా మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. థమన్ ఈ సినిమాకి మరింత హైప్ ఎక్కించే అప్డేట్స్ అందించారు.

థమన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "నేను మీసం తిప్పి మరీ చెప్తున్నా.. OG అన్ని సినిమాలకూ సమాధానం చెబుతుంది. అది వచ్చినప్పుడు మనం ఎవరో తమిళ వాళ్ళకి తెలుస్తుంది. మనం ఏంటనేది ఆ సినిమాతో చూపిస్తాం అంతే. ఒక గ్యాంగ్ స్టర్ ఫిలిం మనం చేస్తే ఎలా ఉంటుందనేది తెలుస్తుంది. జైలర్, లియో, బీస్ట్, విక్రమ్.. ఈ నాలుగు సినిమాలకు కలిపి OG ఒకే ఆన్సర్ ఇస్తుంది. అది మాకు తెలుసు. మన హీరోలు కూడా గ్యాంగ్ స్టర్ సినిమాలు చేస్తే కంటెంట్ మారుతుంది, దానికి తగ్గట్టే సౌండింగ్ మారుతుంది" అని చెప్పారు.

"ఓజీ ఒక అసాధారణమైన సినిమా. తమిళ చిత్రాలు వచ్చినప్పుడు మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో.. దానికి టాలీవుడ్ నుంచి ఇచ్చే పెద్ద సమాధానం ఈ సినిమా. ఇందులో OST చాలా పెద్దగా ఉండబోతోంది. 30 - 40 ట్రాక్స్ ఓఎస్టీ ఉంటుంది. డెఫినెట్ గా తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక బెస్ట్ OST క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఆ సినిమా అలా వుంది కాబట్టి, ఓఎస్టీ కూడా అలానే ఉంటుంది. 6 - 7 సాంగ్స్ ఉంటాయి. ఆల్రెడీ 4 పాటలు ఫినిష్ చేశాం. మిగతా పాటల కోసం సినిమా రిలీజ్ అయ్యే ముందు కూర్చోవాలని అనుకుంటున్నాం" అని తమన్ తెలిపారు.

థమన్ మీసం తిప్పి మరీ OG గురించి ఫుల్ కాన్ఫిడెన్స్ తో చెప్పిన మాటలు.. సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యాలని పవన్ కల్యాణ్ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఇది పాత్ బ్రేకింగ్ మూవీ అవుతుందని, ఎప్పుడొచ్చినా తప్పకుండా బాక్సాఫీస్ రికార్డ్స్ ను తిరగ రాస్తుందని మరికొందరు ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

OG అనేది 1980-90స్ మధ్య జరిగే ఒక గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా. ఇందులో పవన్ కల్యాణ్ కు జోడీగా ప్రియాంక మోహన్ నటిస్తోంది. ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, శ్రియా రెడ్డి, అభిమన్యు సింగ్, హరీష్ ఉత్తమన్, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైమెంట్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో దానయ్య నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తుండగా.. రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.