Begin typing your search above and press return to search.

నాన్న లేరనే లోటు తీరింది : థమన్

ఆయన మాట్లాడుతూ ఈ సినిమా యూనిట్ సృష్టించిన డాకు మహారాజ్ ప్రపంచం చాలా గొప్పదని అన్నారు. ఇది చాలా కొత్తగా ఉంటుంది.

By:  Tupaki Desk   |   11 Jan 2025 3:43 AM GMT
నాన్న లేరనే లోటు తీరింది : థమన్
X

నందమూరి బాలకృష్ణ బాబీ కాంబోలో వస్తున్న క్రేజీ మూవీ డాకు మహారాజ్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించారు. అందాల భామలు శ్రద్ధ శీనాథ్, ప్రగ్యా జైస్వాల్, ఊర్వసి రౌతెలాలు ఫిమేల్ లీడ్ గా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న అంటే రేపు ఆదివారం రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో చిత్ర యూనిట్ స్పీచ్ సినిమాపై అంచనాలు పెంచింది.

ఈవెంట్ లో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ స్పీచ్ కూడా ఆకట్టుకుంది. ఆయన మాట్లాడుతూ ఈ సినిమా యూనిట్ సృష్టించిన డాకు మహారాజ్ ప్రపంచం చాలా గొప్పదని అన్నారు. ఇది చాలా కొత్తగా ఉంటుంది. దీని కోసం యూనిట్ అంతా కూడా ఎంతో కష్టపడ్డారని అన్నారు థమన్. కోవిడ్ టైం లో అఖండ కోసం బాలకృష్ణ గారు ఎంత కష్ట పడ్డారో తెలుసు.. డాకు మహారాజ్ కోసం కూడా అంతే కష్టపడ్డారు. కొన్ని సినిమాలకు ప్రాణం పెట్టి పనిచేయాలి సంగీతం అందించాలని అనిపిస్తుంది. అలాంటి సినిమానే డాకు మహారాజ్ అని అన్నారు థమన్.

విజయ్ కన్నన్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. అలాంటి గొప్ప విజువల్స్ వల్లే నాకు మంచి సంగీతం అందించే ఛాన్స్ వచ్చింది అన్నారు. బాలకృష్ణ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే.. నాకు అమ్మ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది.. కొన్ని మంత్రాలు వినిపిస్తాయి.. ఆ తర్వాత బాలకృష్ణ గారి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఆయన కూడా ఆశీర్వాదాలు అందిస్తారు. నా జీవితంలో నాన్న లేరనే లోటు బాలకృష్ణ గారి వల్ల తీరిపోయిందని అన్నారు బాలకృష్ణ.

నన్ను ఆయన ఎంతో నమ్మారు.. అందుకే బాలకృష్ణ గారి సినిమాకు బాధ్యతగా మనసు పెట్టి సంగీతం అందిస్తా అన్నారు థమన్. ఈ సినిమాతో డైరెక్టర్ బాబీ మరో స్థాయికి వెళ్తారు. నాగవంశీ గారు నా కెరీర్ కి పిల్లర్ లా నిలబడ్డారు. సితార, హారిహ హాసిని క్రియేషన్స్ కి ఎప్పటికీ రుణపడి ఉంట ఈ సంక్రాంతికి డాకు మహారాజ్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది.. మళ్లీ సక్సెస్ మీట్ లో కలుద్దామని జోష్ ఫుల్ స్పీచ్ తో ఫ్యాన్స్ ని అలరించారు థమన్.