మ్యాడ్ స్క్వేర్ లో తమన్ ట్విస్ట్!
ఇప్పటికే విడుదలైన టీజర్‌కు, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. యువతలో ఈ సినిమాపై సాలీడ్ క్రేజ్ నెలకొంది.
By: Tupaki Desk | 25 March 2025 9:26 AM ISTమ్యాడ్ సినిమాతో యూత్‌కు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందించిన చిత్ర బృందం ఇప్పుడు దాని సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’తో వస్తోంది. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లాంటి యంగ్ హీరోలతో, దర్శకుడు కళ్యాణ్ శంకర్ మరోసారి వినోదం పండించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. యువతలో ఈ సినిమాపై సాలీడ్ క్రేజ్ నెలకొంది. ఫన్ ఫుల్ ఫీలింగ్ ఇచ్చే ట్రైలర్, ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ సినిమాపై హైప్‌ను మరింత పెంచాయి.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. 127 నిమిషాల రన్‌టైమ్‌తో, U/A సర్టిఫికేట్ పొందిన ఈ సినిమా మార్చి 29న థియేటర్లలోకి రానుంది. ఇదే రన్‌టైమ్ తో మొదటి పార్ట్ కూడా రిలీజై పెద్ద హిట్ అవ్వడం విశేషం. పాటలు భీమ్స్ సిసిరోలియా కంపోజ్ చేయగా, అవి ఇప్పటికే చార్ట్‌బస్టర్స్ అయ్యాయి. అయితే బీజీఎమ్ విషయంలో సడన్ ట్విస్ట్ ఇచ్చింది సితార ఎంటర్టైన్మెంట్స్.
తమన్ ఈ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించినట్లు అఫీషియల్ గా ప్రకటించారు. ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. భీమ్స్ పాటలు అందించగా, బీజీఎమ్ కోసం తమన్ ఎంట్రీ ఇవ్వడం వెనుక ఉన్న కారణాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అందుకు ప్రధాన కారణం.. ‘మ్యాడ్ స్క్వేర్’పై ఉన్న భారీ అంచనాలు. మాస్, యూత్ ఆడియెన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కూడా టార్గెట్ చేస్తున్న ఈ సినిమా, ఆడియెన్స్‌ను థియేటర్లలో కట్టిపడేయాలంటే విజువల్స్‌కు తోడు సాలిడ్ బీజీఎమ్ అవసరం. ఆ స్పీడ్ కోసం, ఆ ఎనర్జీ కోసం తమన్‌ను తీసుకున్నారని టాక్.
తమన్ ఇటీవల హిట్ ఇచ్చిన సినిమాల జాబితా చూస్తే, మ్యూజిక్ పరంగా ఎంత డెడికేషన్ చూపిస్తున్నాడో స్పష్టమవుతుంది. డాకు మహరాజ్ BGM ను మెచ్చి బాలయ్య ఏకంగా ఖరీదైన కారు ఇచ్చారు. అయితే భీమ్స్ సంక్రాంతికి వస్తున్నాం' వంటి చిత్రాలకు ఇచ్చిన బీజీఎమ్ సినిమాల రేంజ్‌ను బాగా పెంచేసింది. ఒక కామెడీ మూవీ అయినప్పటికీ, ఎమోషనల్ పాయింట్స్‌కు కావాల్సిన మ్యూజిక్, ఎంటర్‌టైనింగ్ సీన్లకు కావాల్సిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో ది బెస్ట్ వర్క్ ఇచ్చాడు.
అయితే, భీమ్స్ బిజీగా ఉన్నందువల్ల ఆ ఆలోచనతో మేకర్స్ తమన్ వైపు మొగ్గుచూపినట్టుగా ఫిల్మ్ సర్కిల్‌లో చర్చ నడుస్తోంది. నిజానికి భీమ్స్ పాటలు సినిమాకు బ్రాండ్ వాల్యూ తెచ్చాయి. కానీ స్కోర్ విషయంలో తన మార్క్ వర్క్ కోసం తమన్‌ను తీసుకోవడం సినిమాకు ప్లస్ అవుతుందన్న ఆశ ఉంది. మొత్తానికి మ్యాడ్ స్క్వేర్ మ్యూజిక్ ఇప్పుడు డబుల్ హైప్ క్రియేట్ చేస్తోంది. మార్చి 29న విడుదలవుతున్న ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల్ని ఎంతవరకు అలరిస్తుందో చూడాలి. తమన్ BGM, భీమ్స్ పాటల కలయికతో ఈ సీక్వెల్ మ్యూజికల్ సక్సెస్ అవుతుందా అన్నది ఆసక్తికర అంశంగా మారింది.