థమన్ జోరుకి మరింత హుషారు తోడైన వేళ!
అయితే కొంతకాలంగా డ్రమ్స్ దంపుడు తగ్గిందనుకోండి. డ్రమ్స్ పై విమర్శలు రావడంతో? దానికి కాస్త ప్రాధాన్యత తగ్గించాడు.
By: Tupaki Desk | 18 Jun 2024 5:38 AM GMTథమన్ సంగీతమంటే ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అతడి సంగీతంలో డ్రమ్స్ ఓ రేంజ్ లో హైలైట్ అవుతుంటాయి. డ్రమ్స్ తో భజాయించడం థమన్ ప్రత్యేకత. ప్రతీ పాటలోనూ డ్రమ్స్ వాయింపులేనిదే? ఆయనకు సంగీతమందించిన సంతృప్తి ఉండదు. అయితే కొంతకాలంగా డ్రమ్స్ దంపుడు తగ్గిందనుకోండి. డ్రమ్స్ పై విమర్శలు రావడంతో? దానికి కాస్త ప్రాధాన్యత తగ్గించాడు.
సంగీతంలో కొత్తగా ప్రయత్నాలు చేస్తూ విమర్శకుల ప్రశంసలందుకుంటున్నాడు. కెరీర్ పరంగా థమన్ కి తిరుగులేదు. సక్సెస్ పుల్ గా దూసుకుపోతున్నాడు. ఏడాదికి ఆరేడు సినిమాలకైనా సంగీతం అందిస్తు న్నాడు. ఈ ఏడాది `గుంటూరు కారం` సక్సెస్ తో బెస్ట్ లాంచింగ్ దొరికింది. సినిమాలో పాటలు మాస్ లోకి బాగా దూసుకెళ్లాయి. కుర్చీ మడత పెట్టిన పాట అయితే ఓ ఊపు ఊపేసింది.
ప్రస్తుతం తమిళ్, తెలుగు, హిందీ మూడు భాషల్లోనూ పని చేస్తున్నాడు. అందులో `ఓజీ`, `గేమ్ ఛేంజర్` లాంటి ప్రతిష్టాత్మక చిత్రాలున్నాయి. తొలిసారి శంకర్ తో పనిచేసే అవకాశం `గేమ్ ఛేంజర్` తో దక్కింది. దీంతో ఈ సినిమాకి ది బెస్ట్ ఇవ్వడానికి ఎంతో తాపత్రయపడుతున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ `ఓజీ` సహా మిగతా సినిమాల కోసం అలాగే శ్రమిస్తున్నాడు. తాజాగా థమన్ కొత్త స్పీకర్లను కొనుగోలు చేసాడు. జెనెలెక్ బ్రాండ్ స్టూడియో-గ్రేడ్ లౌడ్‌స్పీకర్‌లను కొన్నాడు. ఈ స్పీకర్‌ల ధర 3 లక్షల కంటే ఎక్కువగా ఉంటుందని సమాచారం.
ఇవి ఎంతో అత్యుత్తమ సంగీతాన్ని అందిస్తాయి. ముఖ్యంగా స్టూడియోలో పాటల రికార్డింగ్ తర్వాత వారి పని తీరును తెలసుకోవడానకి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయట. కంపోజర్‌లకు ప్రీమియర్ క్వాలిటీ అవుట్‌పుట్‌ను అందిస్తాయి. వీటిని ప్రత్యేకంగా ఓజీ కోసం విక్రయించినట్లు థమన్ హైలైట్ చేసాడు. ఇప్పటికే ఓజీ నుంచి రిలీజ్ అయిన మొదటి పాట గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
అప్పటికి ఈ స్పీకర్లు అందుబాటులో లేవు. త్వరలో రిలీజ్ అయ్యే అన్ని పాటలు ఇదే స్పీకర్ లో థమన్ వినబోతున్నాడు. అదే క్వాలిటీ తో శ్రోతల ముందుకు ఆ పాటలు రాబోతున్నాయి. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి కూడా ఇలాంటి స్పీకర్లు ఎంతో అవసరం. ఆర్ ఆర్ ఆర్ వాయించడంలో థమన్ స్పెషలిస్ట్ అని చెప్పాల్సిన పనిలేదు. ఇందులో థమన్ రెహమాన్ లాంటి దిగ్గజానికే మంచి పోటీ ఇవ్వగలడు. అంతటి గుర్తింపు థమన్ కి ఉంది.