థమన్ కాపీ ట్యూన్లు చేస్తుంటే డైరెక్టర్లు ఏం చేస్తున్నట్లు?
ముఖ్యంగా థమన్ ట్యూన్లు రొటీన్ గా ఉంటాయని...ప్రతీ పాటకి డ్రమ్స్ ని విపరీతంగా వినియోగిస్తాడని కొన్ని రకాల విమర్శలున్నాయి. దీనిపై దివంగత దర్శకరత్న దాసరి నారాయణరావు సైతం పబ్లిక్ గా థమన్ ని హెచ్చరించారు.
By: Tupaki Desk | 10 Oct 2023 2:30 PM GMTటాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ కొన్నాళ్లగా ఇండస్ట్రీని ఏల్తున్నాడు. స్టార్ హీరోల చిత్రాలన్నింటికీ ఆయన సంగీతం అందిస్తున్నారు. ఇలా వరుసగా సినిమాలు చేయడంతో డీఎస్పీని సైతం పక్కకు నెట్టేసాడని ప్రచారం సాగుతుంది. థమన్ సంగీతం అందిస్తోన్న సినిమాలు హిట్ అవ్వడంతో పాటు..కమర్శియల్ యాస్పెక్ట్ లో థమన్ కనెక్ట్ చేయగల్గుతున్నాడని దర్శకుల అభిప్రాయం. పైగా ఇండస్ట్రీ హిట్ ట్రాక్ ఉన్న వాళ్లవైపే చూస్తుంది. ఆ కోణంలో థమన్ టాలీవుడ్ లో బిజీ అయ్యాడు.
ఇక థమన్ మ్యూజిక్ విషయంలో ది బెస్ట్ అందించగలడు...ది వరస్ట్ సైతం అందించగలడు అనే విమర్శలు తొలి నుంచి ఉన్నాయి. ముఖ్యంగా థమన్ ట్యూన్లు రొటీన్ గా ఉంటాయని...ప్రతీ పాటకి డ్రమ్స్ ని విపరీతంగా వినియోగిస్తాడని కొన్ని రకాల విమర్శలున్నాయి. దీనిపై దివంగత దర్శకరత్న దాసరి నారాయణరావు సైతం పబ్లిక్ గా థమన్ ని హెచ్చరించారు. సంగీతంలో కొత్తదనం కావాలని...ఊక దంపుడు వద్దంటూ సలహాలిచ్చారు. అలాగే సోషల్ మీడియాలో విమర్శలు గట్టిగానే తెరపైకి వచ్చాయి.
దీంతో థమన్ లో కొంత ఛేంజ్ కనిపించింది. కొన్ని విమర్శలకు చెక్ పెడుతూ తనదైన మార్క్ సంగీతం తో ప్రెష్ ఫీల్ అందించాడు. అయితే తాజాగా థమన్ మళ్లీ పాత ట్రాక్ లోకి వెళ్లిపోతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవలే రిలీజ్ అయిన 'స్కంద' సంగీతం విషయంలో విమర్శలు ఎదుర్కున్నాడు. రొటీన్ సంగీతం అందించాడని విమర్శించారు. అలాగే 'ఓజీ' టీజర్ కి ఇచ్చిన స్కోర్ కూడా కాపీ అంటున్నారు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన 'భగవంత్ కేసరి' ట్రైలర్ మూస స్కోర్ కనిపించింది. 'బ్రో 'టీజర్ కి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గుర్తుకొస్తుందంటూ నెటిజనులు కామెంట్లు పెడుతున్నారు.
ఆ వీడియోలు షేర్ చేసి ఆధారాలు చూపిస్తున్నారు. దీంతో తన సినిమా సంగీతానే తానే మరోసారి కాపీ కొట్టాడంటూ విమర్శలు తప్పలేదు . అంతకు ముందు 'గాడ్ ఫాదర్' కి సంగీతం అందించినప్పుడు ఇలాంటి విమర్శలే ఎదుర్కున్నాడు. ఇలా ఎన్ని విమర్శలొచ్చినా థమన్ మాత్రం మారండం లేదు. మార్చు చేస్తున్నట్లే చేసి మళ్లీ పాత రూట్లోకి వెళ్లిపోతున్నాడు.
మరి పని ఒత్తిడి కారణంగా చేయలేక పోతున్నాడా? ఇంకేవైనా కారణాలు? ఉన్నాయా? అన్నది తెలియదు గానీ... ఈ మూస సంగీతాన్ని ఆయా చిత్ర దర్శకులు ఎందుకు కాపీ క్యాట్ ..రిపీటెడ్ మ్యూజిక్ ఇస్తున్నాడని కనిపెట్టలేకపోతున్నారు? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇది ఫలానా సినిమా మ్యూజిక్ అని ఆయా దర్శకులకు తెలియక అలా జరుగుతుందా? లేక థమన్ ని ప్రశ్నిస్తే సినిమాకి సంగీతం అందించడని? మాట్లాడటం లేదా? అన్నది అర్ధం కానీ సందేహం. సినిమా ప్లాప్ అయితే ఆ బాధ్యత మొత్తం తీసుకోవా ల్సింది కేవలం దర్శకుడు మాత్రమే. ఆ సినిమాకి సంగీత దర్శకుడి ఎంపిక ఛాయిస్ కూడా దర్శకుడిదే. అలాంటప్పుడు రొటీన్ ట్యూన్లు ఇస్తుంటే? ప్రశ్నించకపోవడం ఏంటి.