Begin typing your search above and press return to search.

దేవి వదిలేస్తే.. తమన్ పట్టేస్తున్నాడు

కమర్షియల్ సినిమాలు అయితే సున్నితంగా తిరస్కరిస్తున్నాడు.

By:  Tupaki Desk   |   9 March 2024 4:00 AM GMT
దేవి వదిలేస్తే.. తమన్ పట్టేస్తున్నాడు
X

టాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ గా తమన్, దేవిశ్రీప్రసాద్ మంచి క్రేజ్ తో కొనసాగుతున్నారు. వీరు గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నారు. వీరిద్దరి డేట్స్ దొరకకపోవడం వలన కొంత మంది వేరే సంగీత దర్శకుల దగ్గరకి వెళ్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ అయితే చాలా సెలక్టివ్ గా సినిమాలు చేస్తున్నాడు. ఒకప్పటిలా స్టార్ హీరోల సినిమాలు అన్ని ఒప్పుకోవడం లేదు. కమర్షియల్ సినిమాలు అయితే సున్నితంగా తిరస్కరిస్తున్నాడు.

ఇక మరోవైపు దేవిశ్రీ ప్రసాద్ వచిలేస్తున్న సినిమాలని తమన్ అందుకుంటున్నాడని టాక్ వస్తోంది. పుష్ప మూవీ తర్వాత దేవిశ్రీ ప్రసాద్ చేసిన కమర్షియల్ మూవీ అంటే వాల్తేరు వీరయ్య. ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. అయితే బాబీ ప్రస్తుతం బాలయ్యతో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం ముందుగా దేవిశ్రీ ప్రసాద్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా అనుకున్నారు.

అయితే దేవిశ్రీ ప్రసాద్ ప్రస్తుతం ఆరు సినిమాలతో బిజీగా ఉండటంతో NBK109 సినిమాని వదులుకున్నాడు. దీంతో సెకండ్ ఆప్షన్ గా బాబీ తమన్ ని ఈ సినిమాకి కన్ఫర్మ్ చేసుకున్నాడు. తాజాగా ఫస్ట్ లుక్ గ్లింప్స్ కి తమన్ సంగీతం అందించాడు. కొరటాల శివ ముందుగా దేవిశ్రీప్రసాద్ తోనే తన సినిమాలకి మ్యూజిక్ చేయించుకన్నారు. కారణం ఏంటో గాని ఆచార్యకు ఆ కాంబినేషన్ బ్రేక్ అయ్యింది. ఇక అఖండ కోసం కూడా దేవి చర్చల్లోకి వచ్చినా అనంతరం తమన్ ని బోయపాటి తీసుకున్నాడు.

తరువాత బాలయ్యతో వీరసింహారెడ్డికి తమన్ మ్యూజిక్ అందించారు. NBK109 బాలయ్య తమన్ కాంబోలో హ్యాట్రిక్ మూవీ కాబోతోంది. కొంత వరకు దేవిశ్రీ ప్రసాద్ వదిలేస్తున్న కమర్షియల్ సినిమాలు అన్ని కూడా ఇప్పుడు తమన్ ఖాతాలో చేరుతున్నాయని టాక్. పైగా మాస్ సినిమాలకు ప్రస్తుతం దేవి లేదంటే తమన్ అనే అప్షన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర, చందూ మొండేటి నాగ చైతన్య తండేల్ మూవీస్ చేస్తున్నాడు.

వాటితో పాటు పుష్ప 2, విశాల్ రత్నం, సూర్య కంగువ, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా లైన్ లో ఉన్నాయి. వీటిలో చాలా వరకు పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతోన్న సినిమాలే కావడం విశేషం. ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే రీజనల్ కమర్షియల్ మూవీగా దేవిశ్రీ ప్రసాద్ ఖాతాలో ఉంది.