Begin typing your search above and press return to search.

మొత్తానికి అడ్డా మార్చేసిన థమన్

ఇప్పుడు తమన్ తన అడ్డాను మార్చేశారు. హైదరాబాద్ లోని ప్రముఖ ప్రసాద్ ల్యాబ్స్ లోనే మ్యూజిక్ వర్క్ చేసేస్తున్నారు.

By:  Tupaki Desk   |   6 Jan 2024 12:16 PM GMT
మొత్తానికి అడ్డా మార్చేసిన థమన్
X

నటుడిగా ఎంట్రీ ఇచ్చి మ్యూజిక్ డైరెక్టర్‌గా టర్న్ తీసుకుని అంచెలంచెలుగా ఎదిగిన సంగీత సంచలనం ఎస్ ఎస్ తమన్. టాలీవుడ్‌ లో దాదాపుగా టాప్ హీరోలందరి సినిమాలకు సంగీతం అందించారు. తెలుగు సినిమాలకు నాన్ స్టాప్‌గా మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. 2023 లో వారసుడు, వీరసింహారెడ్డి, బ్రో, స్కంద, భగవంత్ కేసరి సినిమాలకు సంగీతం అందించిన తమన్ చేతిలో ప్రస్తుతం గుంటూరు కారం, గేమ్ ఛేంజర్, ఓజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

సాధారణంగా తమన్ తన ప్రాజెక్ట్లను చెన్నై తీసుకెళ్లి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోపాటు మిక్సింగ్ వర్క్ ను అక్కడ పూర్తి చేసేవారు. ఇప్పుడు తమన్ తన అడ్డాను మార్చేశారు. హైదరాబాద్ లోని ప్రముఖ ప్రసాద్ ల్యాబ్స్ లోనే మ్యూజిక్ వర్క్ చేసేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాకు సంబంధించి మ్యూజిక్ వర్క్ ను ప్రసాద్ ల్యాబ్స్ లో పదిరోజుల్లో పూర్తి చేశారు.

ఇప్పుడు ఆయన బాణీలు అందిస్తున్న గుంటూరు కారం మ్యూజిక్ వర్క్ ను కూడా ప్రసాద్ ల్యాబ్స్ లోనే పూర్తి చేస్తున్నారు తమన్. ఇంకో నాలుగు రోజులే టైమ్ ఉండడంతో పగలూరాత్రి కష్టపడుతున్నారు. హిట్ కోసం ఎదురుచూస్తున్న బాలయ్య, పవన్ కు సూపర్ మ్యూజిక్ అందించిన తమన్.. గుంటూరు కారం మూవీకి ఎలాంటి బాణీలు కట్టారో చూడాలి. మహేశ్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి లీడ్స్ రోల్స్ పోషించిన ఈ మూవీ జనవరి 12న విడుదల కానుంది.

తెలుగు, తమిళం సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న తమన్ మొదట.. నటుడిగా బాయ్స్ సినిమాలో నటించారు. తర్వాత పూర్తిగా సంగీతం వైపు మళ్లారు. రాజ్-కోటి, వందేమాతరం శ్రీనివాస్, చక్రి, ఆర్పీ పట్నాయక్, దేవిశ్రీ ప్రసాద్ వంటి ప్రముఖ సంగీత దర్శకుల వద్ద కీబోర్డు ప్లేయర్ గా పనిచేశారు. 2008 లో తమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన మొదటి సినిమా మళ్లీ మళ్లీ.

ఆ తర్వాత 2010 లో రవితేజ కిక్ సినిమాకు సంగీతం అందించారు. ఆ తర్వాత నాన్ స్టాప్‌గా సినిమాలు చేస్తూనే ఉన్నారు. బృందావనం, రగడ, మిరపకాయ్, దూకుడు, బాడీగార్డ్, బిజినెస్ మేన్, నిప్పు, నాయక్, గ్రీకు వీరుడు, బలుపు, రామయ్యా వస్తావయ్యా, మసాలా, రేసుగుర్రం, పవర్ ఆగడు, కిక్ 2, సరైనోడు, విన్నర్, జవాన్, అరవింద సమేత వీర రాఘవ, వకీల్ సాబ్.. ఇలా నాన్ స్టాప్‌గా పెద్ద స్టార్ల సినిమాలకు సంగీతం అందించారు తమన్.