థమన్ 'బ్రో' ఏం చేసినా ఇది తప్పట్లేదు
తాజాగా ఆయన బ్రో మూవీ పాటలపై విపరీతంగా ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. కొందరైతే కనీసం ఒక్క పాట కూడా బాలేదని , థమన్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
By: Tupaki Desk | 17 July 2023 5:30 AM GMTప్రస్తుతం టాలీవుడ్ లో థమన్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. దాదాపు టాలీవుడ్ లో అందరు స్టార్ హీరోలకు మ్యూజిక్ ఆయనే అందిస్తున్నారు. పవన్ బ్రో, మహేష్ గుంటూరు కారం ఇలా చాలానే క్యూ ఉంది. అయితే, థమన్ ఎలాంటి మ్యూజిక్ అందించినా ఆయనను ట్రోల్ చేస్తూ ఉంటారు.
ముఖ్యంగా ఆయన ట్యూన్స్ కాపీ కొడుతూ ఉంటారని విమర్శిస్తూ ఉంటారు. ఆయన కంపోజ్ చేసిన పాట విడుదల కాగానే, అది ఈ సాంగ్ కాపీనే అంటూ సోషల్ మీడియాలో లో కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా ఆయన బ్రో మూవీ పాటలపై విపరీతంగా ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. కొందరైతే కనీసం ఒక్క పాట కూడా బాలేదని , థమన్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. సాయిధరమ్ తేజ్ కెరీర్ లోనే ఇంత చెత్త మ్యూజిక్ ఆల్బమ్ లేదని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇక పవన్ ఫ్యాన్స్ గురించి అయితే చెప్పనవసరం లేదు.
అయితే, థమన్ మాత్రం తన పనిని తాను సమర్థించుకుంటున్నారు. తన పని దర్శక నిర్మాతలకు బాగా నచ్చుతోందని చెప్పారు. తాను ఇచ్చే అవుట్ పుట్ చూసి వారు ఇష్టపడుతున్నారని, అయినా ఫ్యాన్స్ తనను ఎందుకు ట్రోల్ చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బ్రో మూవీ పాటలు బాలేవు అనే ఫిర్యాదు చేయగా, అసలు ఆ సినిమాలో పాటలకు స్కోప్ లేదని, అంతకు మించి ఇవ్వలేమని చెప్పడం విశేషం.
మొదటి పాట 'మై డియర్ మార్కండేయ' విడుదలైనప్పుడు , అంతకుమించి ఏమీ ఇవ్వలేమని చెప్పాడు, సరే ఒప్పుకుంటాం, కానీ తేజ్, కేతికాల మధ్య జాణవులే పాట మంచి డ్యూయట్ కాదా, మరి అది కూడా ఎందుకు బాలేదు అని విమర్శిస్తున్నారు. పాట కొంచెం కూడా ఫ్రెష్ గా లేదని, ఎక్కడో విన్న పాటలానే ఉందని మండిపడుతున్నారు.
మూవీ క్లిక్ అవ్వడానికి అందులోని పాటలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అలాంటి థమన్ అస్సలు ఈ మధ్య జాగ్రత్తలు తీసుకోవడం లేదని, ముఖ్యంగా బ్రో పాటలు అయితే చాలా బోరింగ్ ఉన్నాయని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మరి దీనిపై థమన్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఇదిలా ఉండగా, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలిసి నటించిన చిత్రం ‘బ్రో’. సముద్రఖని దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం తుది మెరుగులు దిద్దుకుంటోంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.