Begin typing your search above and press return to search.

శ్రీవారి స‌న్నిధానంలో స‌ర్ ప్రైజ్ చేసిన‌ థ‌మ‌న్!

ఇటీవ‌లే ర‌వితేజ స‌ర‌స‌న మ‌రో సినిమాకి సైన్ చేసింది. స‌రైన పాన్ ఇండియా సినిమాలేవైనా వ‌స్తాయా? అన్న ఆశ‌తోనూ ఎదురు చూస్తుంది.

By:  Tupaki Desk   |   25 Jun 2024 1:13 PM GMT
శ్రీవారి స‌న్నిధానంలో స‌ర్ ప్రైజ్ చేసిన‌ థ‌మ‌న్!
X

యంగ్ బ్యూటీ శ్రీలీల ప‌ర‌భాషా అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నిస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళ్, హిందీ భాష‌ల్లో అమ్మ‌డు స‌త్తా చాటాల‌ని సీరియ‌స్ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. `గుంటూరు కారం` త‌ర్వాత తెలుగులో స్పీడ్ త‌గ్గ‌డంతో ఇక్క‌డ కూర్చుని స‌మ‌యం వృద్ధా చేయ‌కుండా చెన్న‌, ముంబై అంటూ చ‌క్కెర్లు కొడుతుంది. అలాగ‌ని టాలీవుడ్ ని లైట్ తీసుకోలేదు. ఇటీవ‌లే ర‌వితేజ స‌ర‌స‌న మ‌రో సినిమాకి సైన్ చేసింది. స‌రైన పాన్ ఇండియా సినిమాలేవైనా వ‌స్తాయా? అన్న ఆశ‌తోనూ ఎదురు చూస్తుంది.

ఈ నేప‌థ్యంలో తాజాగా శ్రీలీల త‌ల్లితో పాటు నేడు తిరుమ‌ల వెంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకుంది. అయితే ప్ర‌త్యేక ద‌ర్శ‌నం స‌మ‌యంలో మ్యూజిక్ డైరెక్ట‌ర్ థ‌మ‌న్ కూడా దేవాల‌యంలో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాడు. అలా శ్రీలీల‌- థ‌మ‌న్ క‌లుసుకున్నారు. ఇద్ద‌రు ఒక‌ర్ని ఒక‌రు ఆప్యాయంగా ప‌ల‌క‌రించుకున్నారు. శ్రీలీల‌ని అక్క‌డ చూసి స‌ర్ ప్రైజ్ అయ్యాడు థ‌మ‌న్.

దీనికి సంబంధించిన‌ వీడియో ఒక‌టి నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఆ స‌ర‌దా స‌న్నివేశం చూసి అభిమానులు ముచ్చ‌ట ప‌డిపోతున్నారు. శ్రీలీల ఇండ‌స్ట్రీలో అంద‌రితో ఎంతో స‌ర‌దాగా ఉంటుంది. ఎవ‌రితోనైనా ఇట్టే క‌లిసిపోయే మ‌న‌స్త‌త్వం గ‌ల‌ది. హీరోయిన్ అనే భావం ఎక్క‌డా చూపించ‌దు. ఎంతో డౌన్ టూ ఎర్త్ ఉంటుం ది. థ‌మ‌న్ కూడా స‌హ‌చ‌రుల‌తో అంతే స‌ర‌దాగా ఉంటాడు, జోకులేస్తాడు. బాగా క్లోజ్ గా ఉంటే? థ‌మ‌న్ మంచి కామెడీ పీస్ లా మారిపోతాడు. థ‌మ‌న్ తో స్టార్ హీరోలు సైతం అంతే స‌ర‌దాగా ఉంటారు.

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో బిజీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా ఉన్న సంగ‌తి తెలిసిందే. రామ్ చ‌ర‌ణ్ హీరోగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న గేమ్ ఛేంజ‌ర్ చిత్రానికి ఆయ‌నే సంగీతం అందిస్తున్నాడు. ఈసినిమాపై చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. శంక‌ర్ ఎంతో న‌మ్మి అవ‌కాశం ఇవ్వ‌డంతో ది బెస్ట్ ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నించారు.