థమన్.. ఇదే అసలు ఆయుధం!
మ్యూజిక్ లో దమ్ముంటే ప్రపంచం వ్యాప్తంగా మన పాటలకి స్టెప్పులు వేస్తారు.
By: Tupaki Desk | 16 March 2024 5:12 AM GMTప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ అన్ని భాషలలో నడుస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా తమ ట్యూన్స్ ని యూనివర్శల్ గా వినబడేలా చేసుకుంటున్నారు. పుష్ప సినిమాలోని సాంగ్స్ ప్రపంచ వ్యాప్తంగా ఎంత పాపులర్ అయ్యాయో అందరికి తెలిసిందే. అలాగే కాంతారా, కేజీఎఫ్ సిరీస్ మ్యూజిక్ కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. కీరవాణి ఏకంగా ఆస్కార్ అందుకున్నారు. మ్యూజిక్ లో దమ్ముంటే ప్రపంచం వ్యాప్తంగా మన పాటలకి స్టెప్పులు వేస్తారు. అలాగే రెస్పెక్ట్ చేస్తారని ఈ మ్యూజిక్ డైరెక్టర్స్ ప్రూవ్ చేసుకున్నారు.
టాలీవుడ్ లో కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ కి మంచి పేరు ఉంది. తెలుగులో స్టార్ హీరోల చిత్రాలకి తనదైన మ్యూజిక్ అందిస్తూ దూసుకుపోతున్నాడు. ఏడాదికి డజనుకి పైగా సినిమాలు చేస్తున్నాడు. అయితే తన మ్యూజిక్ తో పాన్ ఇండియా ఆఫర్స్ మాత్రం థమన్ సొంతం చేసుకోలేకపోతున్నారు. ఇప్పటి వరకు పాన్ ఇండియా రేంజ్ లో అంటే రాధేశ్యామ్ కి బ్యాగ్రౌండ్ స్కోర్ చేశారు. అది పెద్దగా క్లిక్ కాలేదు. స్కంద మూవీ చేసిన డిజాస్టర్ అయ్యింది.
ప్రస్తుతం థమన్ చేతిలో గేమ్ చేంజర్, OG సినిమాలు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ గా ఉన్నాయి. ఈ రెండు సినిమాలతో తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గేమ్ చేంజర్ అయితే రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాబట్టి కొత్తదనం పెద్దగా ఎక్స్ పెక్ట్ చేయలేము. కానీ సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న OG మూవీ మాత్రం కంప్లీట్ న్యూ వరల్డ్ లో తెరకెక్కుతోంది.
హాలీవుడ్ స్టాండర్డ్స్ లో సుజిత్ ఈ చిత్రాన్ని యాక్షన్ ప్యాక్డ్ మూవీగా ఆవిష్కరిస్తున్నారు. ఇలాంటి సినిమాలకి స్టైలిష్ అండ్ హై వోల్టేజ్ సాంగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వాల్సి ఉంటుంది. దానికి కావాల్సిన కంటెంట్ కూడా మూవీలో ఉంది. ఇప్పటికే ఇలాంటి కథలకి దేవిశ్రీ, అనిరుద్, అజనీష్ లోక్ నాథ్, రవి బసృర్ లాంటి వారు బెస్ట్ సాంగ్స్, స్కోర్ ఇచ్చి పాన్ ఇండియా లెవల్ లో తమ బ్రాండ్ పెంచుకున్నారు. ఇప్పుడు థమన్ కి OG మూవీతో మంచి ఛాన్స్ వచ్చింది.
ఇప్పటికైనా ఒకే ఫార్మాట్ లో రెగ్యులర్ సౌండ్స్ తో సాంగ్స్ చేయకుండా మ్యూజిక్ పరంగా కాస్తా కొత్తదనం చూపించే ప్రయత్నం చేస్తే థమన్ కి కూడా పాన్ ఇండియా మార్కెట్ లో మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి ఛాన్స్ ఉంటుంది. లేదంటే రీజనల్ కమర్షియల్ సినిమాలకే పరిమితం అయిపోవాల్సి వస్తుంది. థమన్ తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి OG కి మించిన ఛాన్స్ లేదనే మాట వినిపిస్తోంది.