Begin typing your search above and press return to search.

100 కోట్ల పాటలకు.. తమన్ ఎలా కొట్టాడో?

తమన్ గేమ్ చేంజర్ మూవీకి సంగీతం అందిస్తున్నారు. శంకర్ సినిమా అంటే ఇప్పటి వరకు రెహమాన్ పేరు మాత్రమే వినిపించేది.

By:  Tupaki Desk   |   5 Aug 2023 3:59 AM GMT
100 కోట్ల పాటలకు.. తమన్ ఎలా కొట్టాడో?
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ మూవీ తెరకెక్కుతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నుంచి రాబోతోన్న పాన్ ఇండియా మూవీ ఇదే కావడం విశేషం. ఇందులో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. తండ్రి కొడుకులుగా అతని రెండు భిన్నమైన నేపథ్యాల లో కనిపించబోతున్నారు. అంజలి, కియారా అద్వానీ సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నారు.

శంకర్ సినిమా అంటేనే సాంగ్స్ చాలా రిచ్ గా ఉంటాయనే మాట వినిపిస్తుంది. కంటెంట్ కంటే అందులో సాంగ్స్ కోసం కోట్ల రూపాయిలు శంకర్ ఖర్చు పెడుతూ ఉంటారు. దానికి తగ్గట్లుగానే ఆయన సినిమాల లో సాంగ్స్ మిగిలిన వాటికి భిన్నంగా నిలుస్తూ ఉంటాయి. ఇప్పుడు చెర్రీతో చేస్తోన్న గేమ్ చేంజర్ మూవీకి కూడా అలాగే శంకర్ ప్లాన్ చేస్తున్నారు. ఒక్కో సాంగ్ ఒక్కో డాన్స్ మాస్టర్ కి ఇచ్చారు.

జానీ మాస్టర్, ప్రభుదేవా, ప్రేమ్ రక్షిత్, గణేష్ ఆచార్య, బోస్కో మార్టీన్ గేమ్ చేంజర్ కోసం వర్క్ చేశారు. అలాగే మొత్తం సాంగ్స్ కోసమే 100 కోట్ల రూపాయిలు శంకర్ ఖర్చు చేస్తున్నారంట. అద్భుతమైన లొకేషన్స్ తో పాటు, అదిరిపోయే సెట్ వర్క్ కూడా ఈ సాంగ్స్ కోసం వేసినట్లు తెలుస్తోంది. తమన్ గేమ్ చేంజర్ మూవీకి సంగీతం అందిస్తున్నారు. శంకర్ సినిమా అంటే ఇప్పటి వరకు రెహమాన్ పేరు మాత్రమే వినిపించేది.

అయితే తెలుగు లో శంకర్ చేస్తోన్న మొదటి చిత్రానికి రెహమాన్ ని కాకుండా తమన్ కి ఛాన్స్ లభించింది. ఈ అవకాశాన్ని తమన్ కరెక్ట్ గా వాడుకొని అతని ఇమాజినేషన్ కి సరిపోయే లెవల్ లో సాంగ్స్ ఇచ్చాడో లేదా అనేది చెర్రీ ఫ్యాన్స్ ఆసక్తిగా గమనిస్తున్నారు. సాంగ్స్ ఇప్పటికే కంపోజ్ అయిపోయాయి. శంకర్ కి కూడా విపరీతంగా కనెక్ట్ అయ్యాయి. కచ్చితంగా తమన్ కెరియర్ లో బెస్ట్ ఆల్బమ్ అవుతుందని చిత్ర యూనిట్ నుంచి వినిపిస్తోంది.

రామ్ చరణ్ మంచి డాన్సర్ కాబట్టి అతని ని శంకర్ కూడా పాటల కోసం కరెక్ట్ గా వాడుకునే అవకాశం ఉంది. మరి తెలుగు లో మునుపెన్నడూ లేని విధంగా వంద కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సాంగ్స్ ఏ మేరకు ప్రేక్షకుల ని ఎంటర్టైన్ చేస్తాయనేది చూడటానికి మెగా ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. అలాగే గేమ్ చేంజర్ మూవీ నుంచి ఒక్క సాంగ్ అయిన రిలీజ్ చేయాలని కోరుకుంటున్నారు.