Begin typing your search above and press return to search.

తండేల్ ఆజాది సాంగ్.. హిట్టు వైబ్ డబుల్ అబ్బా..!

ఇప్పటికే తండేల్ నుంచి వచ్చిన సాంగ్స్ అన్ని చార్ట్ బస్టర్స్ కాగా వాటికి ఏమాత్రం తక్కువ కాకుండా ఆజాది సాంగ్ ఉంది.

By:  Tupaki Desk   |   7 Feb 2025 3:55 AM GMT
తండేల్ ఆజాది సాంగ్.. హిట్టు వైబ్ డబుల్ అబ్బా..!
X

నాగ చైతన్య చందు మొండేటి కాంబోలో వస్తున్న తండేల్ సినిమా కొద్ది గంటల్లో ఫస్ట్ షో పడబోతుంది. సినిమా రిలీజ్ కొద్ది గంటల ముందు ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ పెట్టి సినిమా నుంచి సర్ ప్రైజింగ్ గా మరో సాంగ్ ని రిలీజ్ చేశారు మేకర్స్. అల్లు అరవింద్ సినిమా అంటే ఇలాంటివి కామనే.. ఆడియన్స్ పల్స్ పట్టేందుకు కరెక్ట్ టైం లో తండేల్ నుంచి ఆజాది సాంగ్ రిలీజ్ చేశారు. ఇప్పటికే తండేల్ నుంచి వచ్చిన సాంగ్స్ అన్ని చార్ట్ బస్టర్స్ కాగా వాటికి ఏమాత్రం తక్కువ కాకుండా ఆజాది సాంగ్ ఉంది.

శ్రీరమణ సాహిత్యం అందించిన ఈ సాంగ్ కు దేవి శ్రీ ప్రసాద్ మరోసారి తన మార్క్ మ్యూజిక్ అందించాడు. సాంగ్ ని వింటే ఇది కచ్చితంగా జైల్ సీక్వెన్స్ లో వచ్చే పాటలా ఉంది. ఆజాది సాంగ్ ఇన్ స్టంట్ గా ఎక్కేసింది. సినిమాపై అప్పటికే ఒక అంచనాకి వచ్చే ఆడియన్ కి ఈ సాంగ్ ఇంకాస్త ఊపు తెప్పించేలా ఉంటుందని చెప్పొచ్చు. సాంగ్ విన్నప్పుడే తెలియకుండానే ఒక వైబ్ వచ్చేసింది.

ఇక చివర్లో వందే మాతరం వందే మాతరం అనగానే సీట్లలో ఎవరైనా కూర్చుని ఉంటారా లేదా సీటీలు చిరిగిపోయేలా అల్లరి చేస్తారా అన్నట్టుగా ఉంది. సినిమాను జనాల్లోకి ఎంతగా ఎక్కించాలో ముందు సాంగ్స్, ఆ తర్వాత టీజర్ ట్రైలర్ చివర్లో ఆజాది సాంగ్. మొత్తం దేవి మ్యూజిక్ తో తండేల్ కి హిట్టు వైబ్ తెచ్చేలా చేశారు. సినిమా కథ కథనం ఎలా ఉంటుంది అన్నది పక్కన పెడితే ఈ సాంగ్స్ ట్రైలర్ చూశాక మాత్రం పక్కా హిట్ అనేలా ఉంది.

మరికొద్ది గంటల్లో తండేల్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా విషయంలో అన్నీ పర్ఫెక్ట్ గా కుదురుతూ వచ్చాయి. ఇక సినిమాకు పాజిటివ్ టాక్ గానీ వస్తే మాత్రం అక్కినేని హీరో ఖాతాలో 100 కోట్ల సినిమా షురూ అయినట్టే లెక్క. చైతన్య ఈ సినిమాకు పడిన కష్టానికి అక్కినేని ఫ్యాన్స్ అది గిఫ్ట్ గా ఇచ్చేలా ఉన్నారని చెప్పొచ్చు. మరి సినిమా ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.