Begin typing your search above and press return to search.

తండేల్ బాక్సాఫీస్ జాతర.. 5 రోజుల లెక్క!

సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. నాగ చైతన్య కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది.

By:  Tupaki Desk   |   12 Feb 2025 9:51 AM GMT
తండేల్ బాక్సాఫీస్ జాతర.. 5 రోజుల లెక్క!
X

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమా అంచనాలను మించి భారీ కలెక్షన్స్ అందుకుంటోంది. చందు మొండేటి దర్శకత్వంలో బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా నిజజీవితంలోని సంఘటనల ఆధారంగా రూపొందడం విశేషం. అల్లు అరవింద్ సమర్పణలో వచ్చిన ఈ సినిమా నాగ చైతన్య కెరీర్‌లోనే హైయెస్ట్ బడ్జెట్ సినిమాగా నిలిచింది. విడుదలకు ముందే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. బుజ్జి తల్లి, హైలెస్సా పాటలు ఇప్పటికే సెన్సేషన్ అయ్యాయి. వీటి ద్వారా సినిమా ఓవర్సీస్ మార్కెట్‌లోనూ బాగా కనెక్ట్ అయింది.


సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. నాగ చైతన్య కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజే రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ఆడియన్స్‌తో పాటు సినీ విశ్లేషకులు కూడా సినిమాపై ప్రశంసలు కురిపించారు. నాగ చైతన్య నటన, సాయి పల్లవి పెర్ఫార్మెన్స్, చందు మొండేటి టేకింగ్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్.. ఈ నాలుగు సినిమాను మరింతగా ఎలివేట్ చేశాయి. ఫ్యామిలీ, యూత్, మాస్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా సినిమా అన్ని కోణాల్లో హిట్ ఫార్ములాను ఫాలో అయింది.


వసూళ్ల పరంగా చూస్తే తండేల్ కేవలం ఓపెనింగ్స్‌తోనే కాదు, నాలుగు రోజులుగా స్టడీగా గ్రోత్ కొనసాగిస్తూ భారీ కలెక్షన్లను సాధిస్తోంది. మొదటి రోజు 21.27 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా, రెండో రోజు 41.20 కోట్ల మార్క్‌ను అందుకుంది. ఇక మూడు రోజులకు గాను 62.37 కోట్లు క్రాస్ చేయడం విశేషం. వీకెండ్‌లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌తో నాలుగో రోజు 73.20 కోట్లు వరల్డ్‌వైడ్‌గా సాధించింది.

తాజాగా ఐదో రోజు తండేల్ లెక్క 80.12 కోట్లకు చేరడం విశేషం. వీకెండ్ తర్వాత కూడా స్టడీగా వసూళ్లు నమోదవుతున్నాయి. వీక్‌డేస్‌లో సినిమా డౌన్ అవుతుందనే అనుకున్నారు కానీ, మంగళవారం కూడా భారీగా టిక్కెట్లు అమ్ముడుపోవడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో వీక్‌డేస్ కూడా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఇక ఓవర్సీస్‌లో సినిమా అద్భుతమైన ఫిగర్స్‌తో దూసుకుపోతోంది. ఐదో రోజు పూర్తయ్యేసరికి సినిమా టోటల్ కలెక్షన్లు 80.12 కోట్ల మార్క్‌ను అందుకోవడం విశేషం.

ఈ స్పీడ్‌తో వెళ్లితే త్వరలోనే వంద కోట్ల క్లబ్ చేరడం ఖాయమనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇప్పటికే నాగ చైతన్య కెరీర్‌లో హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచిన తండేల్, త్వరలో మరో కొత్త రికార్డ్ ను అందుకోవడం ఖాయం.

తండేల్ 5 రోజుల లెక్క- కలెక్షన్స్ ఇలా పెరుగుతూ వచ్చాయి..

మొదటి రోజు – 21.27Cr

రెండవ రోజు – 41.20Cr

మూడవ రోజు – 62.37Cr

నాలుగు రోజు– 73.20Cr

ఐదు రోజు – 80.12Cr (టోటల్)