Begin typing your search above and press return to search.

'తండేల్‌' 3 రోజుల కలెక్షన్స్‌ రూ.62.37... చైతూ కెరీర్‌లో రికార్డ్‌

'తండేల్‌' సినిమా మొదటి మూడు రోజుల్లో వరల్డ్‌ బాక్సాఫీస్‌ వద్ద రూ.62.37 కోట్లు రాబట్టిందని అధికారిక ప్రకటన వచ్చింది.

By:  Tupaki Desk   |   10 Feb 2025 5:26 AM GMT
తండేల్‌ 3 రోజుల కలెక్షన్స్‌ రూ.62.37... చైతూ కెరీర్‌లో రికార్డ్‌
X

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో బన్నీ వాసు నిర్మించిన 'తండేల్‌' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతూ దూసుకు పోతుంది. మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు అధిక వసూళ్లు నమోదు అయ్యాయి. మూడో రోజు అయిన ఆదివారం సైతం అత్యధిక వసూళ్లు నమోదు చేయడంతో తండేల్‌ మొదటి వీకెండ్‌ పూర్తి అయ్యేప్పటికి సాలిడ్ కలెక్షన్స్‌తో స్ట్రాంగ్‌గా నిలిచింది. నాగ చైతన్య కెరీర్‌లో ఇదే హైయెస్ట్‌ ఓపెనింగ్‌ కలెక్షన్స్‌గా తెలుస్తోంది. నాగ చైతన్య చాలా కాలం తర్వాత ఈ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


'తండేల్‌' సినిమా మొదటి మూడు రోజుల్లో వరల్డ్‌ బాక్సాఫీస్‌ వద్ద రూ.62.37 కోట్లు రాబట్టిందని అధికారిక ప్రకటన వచ్చింది. గీతా ఆర్ట్స్ నుంచి అధికారికంగా ప్రకటన వచ్చింది. అక్కినేని హీరోల సినిమాలు ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టి చాలా కాలం అయ్యింది. ఫ్యాన్స్ నిరాశ నిస్పృహలో ఉన్న సమయంలో వచ్చిన తండేల్‌ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదు చేస్తూ దూసుకు పోతుంది. అతి త్వరలోనే సినిమా రూ.100 కోట్ల పోస్టర్‌ పడుతుందని అంతా నమ్మకంగా ఉన్నారు. ఇటీవల నాగ చైతన్య ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తండేల్‌ సినిమా రూ.100 కోట్లు రాబట్టబోతుంది. ఫ్యాన్స్ కేక్‌ ఆర్డర్‌ ఇచ్చి కట్‌ చేసేందుకు రెడీగా ఉండండి అంటూ ధీమా వ్యక్తం చేశారు.


నాగ చైతన్య, సాయి పల్లవి కాంబోలో గతంలో వచ్చిన లవ్‌ స్టోరీ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కనుక ముందు నుంచే తండేల్‌ పై అంచనాలు పెరిగాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా తండేల్‌ను దర్శకుడు చందు మొండేటి రూపొందించారు. నిజ జీవిత కథను తీసుకుని, దానిలో ప్రేమ కథను చూపించారు. ఆ ప్రేమ కథకు మంచి స్పందన వచ్చింది. రియల్‌ స్టోరీ కంటే రీల్‌ లవ్‌ స్టోరీ బాగుంది అంటూ ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా దేవి శ్రీ ప్రసాద్‌ అందించిన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌, పాటలు సినిమా స్థాయిని అమాంతం పెంచాయి. బుజ్జి తల్లి, హైలెస్సా సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్‌ దక్కింది.

సంక్రాంతికి వచ్చిన సినిమాల జోరు తగ్గిన సమయంలో వచ్చిన తండేల్ సినిమా బాక్సాఫీస్ వద్ద మరోసారి సందడి చేస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్‌, యూత్‌ ఆడియన్స్‌ థియేటర్‌కి క్యూ కట్టడంతో భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. వీక్‌ డేస్‌లో కాస్త ప్రభావం చూపించగలిగితే వచ్చే వీకెండ్‌లో రూ.100 కోట్ల వసూళ్లను క్రాస్ చేయడం పెద్ద కష్టం ఏమీ కాకపోవచ్చు. నాగ చైతన్య కు మొదటి వంద కోట్ల సినిమాగా తండేల్‌ సినిమా నిలుస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు భారీగా నమోదు అవుతున్నాయి, కానీ నార్త్‌ ఇండియా, ఇతర సౌత్‌ రాష్ట్రాల్లో మాత్రం వసూళ్లు నమోదు కావడం లేదు. ముఖ్యంగా హిందీ, తమిళ్‌లో ఈ సినిమాకు మినిమం ఓపెనింగ్స్ వస్తాయని అంతా భావించారు. కానీ అక్కడ తండేల్‌కి నిరాశే మిగిలింది. కానీ తెలుగు రాష్ట్రాల వసూళ్లతో బ్రేక్‌ ఈవెన్‌కి చేరువైంది.