తండేల్ 'బుజ్జితల్లి'– హార్ట్ టచింగ్ ట్యూన్స్ తో దేవి మ్యాజిక్
టాలీవుడ్ టాలెంటెడ్ యువ హీరో నాగచైతన్య, స్టార్ హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమా తండేల్.
By: Tupaki Desk | 21 Nov 2024 1:24 PM GMTటాలీవుడ్ టాలెంటెడ్ యువ హీరో నాగచైతన్య, స్టార్ హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమా తండేల్. ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక సినిమాకి సంబంధించిన అప్డేట్స్ తో మరింత హైప్ క్రియేట్ అవుతోంది. ఫైనల్ గా సినిమా నుంచి మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభమయ్యాయి. మొదటి సింగిల్ "బుజ్జితల్లి" లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.
చందూ మొండేటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ప్రేమ, యాక్షన్ నేపథ్యంలో సాగుతుండగా, బుజ్జితల్లి పాట ప్రేమ జంట మధ్య భావోద్వేగాలను హైలెట్ చేస్తోంది. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాట అందమైన మెలోడీతో శ్రోతలను ఆకట్టుకుంటోంది. 'సముద్రం సాక్షిగా ఒక యథార్థ ప్రేమకథ' అంటూ లిరికల్ సాంగ్ మొదలైన విధానం బాగుంది. దేవిశ్రీ ప్రసాద్ ఎమోషనల్ ట్యూన్స్ తో కంపోజ్ చేసి, ఈ పాటను అందించారు. శ్రీవాణి రాసిన సాహిత్యం ప్రేమికుల మధ్య ఉన్న అనుబంధాన్ని అక్షర రూపంలో వెలుగులోకి తీసుకొచ్చింది.
జావేద్ అలీ పాడిన ఈ పాట హార్ట్ ను టచ్ చేసే విధంగా ఉంది. అతని గాత్రం పాటకు మరింత ప్రేమను జోడించింది. బుజ్జితల్లి పాట కథలో కీలకమైన సందర్భంలో వస్తుందని మేకర్స్ తెలిపారు. కథానాయకుడు తన ప్రేయసిని ఓదార్చే క్రమంలో ఈ పాట తెరపై కనిపిస్తుంది. ఈ పాట ద్వారా వారి మధ్య ఉన్న ప్రేమను అద్భుతంగా ప్రతిబింబించారు. లిరికల్ వీడియోలో చూపించిన లొకేషన్లు, విజువల్స్ చూడగానే ఆకట్టుకుంటాయి.
నాగచైతన్య, సాయి పల్లవి జంట తెరపై క్యూట్ గా హైలెట్ అయ్యారు. ఈ జంట తమ కెమిస్ట్రీతో ప్రేక్షకులను ముగ్ధులను చేస్తుంది. పాట మాత్రం ఈ ఏడాది సూపర్ హిట్ ప్రేమగీతంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మిస్తుండగా, అల్లు అరవింద్ ప్రొడక్షన్‌ను సమర్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా డి మచిలేశం గ్రామంలో జరిగిన నిజ జీవన ఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది.
ప్రేమ కథతో పాటు దేశానికి సంబంధించిన ఎమోషన్స్ యాక్షన్ ఎలిమెంట్స్ కలగలిపి ఒక ప్రత్యేకమైన సినిమాగా తండేల్ ఆకట్టుకోనుంది. సినిమాటోగ్రఫీని షామ్‌దత్ హ్యాండిల్ చేస్తుండగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఆర్ట్ విభాగానికి శ్రీనగేంద్ర తంగాలా నేతృత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కాబోతుండగా, బుజ్జితల్లి పాట ద్వారా తండేల్ టీం ప్రమోషన్స్‌కు బలమైన ప్రారంభం ఇచ్చింది. థండేల్ కేవలం మంచి కథతోనే కాకుండా, మ్యూజికల్ హిట్‌గా కూడా నిలిచే అవకాశం ఉందని చెప్పొచ్చు.