Begin typing your search above and press return to search.

తండేల్.. మిగతా సినిమాలకు దెబ్బ పడిందిగా..

సినిమా విడుదలైన తొలి రోజు నుంచే తండేల్ బాక్సాఫీస్‌ను శాసిస్తోంది. నాగ చైతన్య కెరీర్‌లోనే భారీ ఓపెనింగ్స్ అందుకున్న ఈ సినిమా, వారం రోజులు గడిచినా అదే జోరు కొనసాగిస్తోంది.

By:  Tupaki Desk   |   16 Feb 2025 12:30 PM GMT
తండేల్.. మిగతా సినిమాలకు దెబ్బ పడిందిగా..
X

సినిమా విడుదలైన తొలి రోజు నుంచే తండేల్ బాక్సాఫీస్‌ను శాసిస్తోంది. నాగ చైతన్య కెరీర్‌లోనే భారీ ఓపెనింగ్స్ అందుకున్న ఈ సినిమా, వారం రోజులు గడిచినా అదే జోరు కొనసాగిస్తోంది. వాలెంటైన్స్ వీకెండ్‌కి పలు కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చినప్పటికీ, వాటి ప్రభావం తండేల్‌పై ఏమాత్రం పడలేదని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. కొత్త సినిమాలు వచ్చినా, రీ రిలీజ్ మూవీస్ ప్రేక్షకులను ఆకర్షించినా, తండేల్ మాత్రం టిక్కెట్ బుకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతూ బాక్సాఫీస్‌పై హవా చూపిస్తోంది.

ఈ వీకెండ్‌కి విడుదలైన లైలా, బ్రహ్మానందం, వంటి సినిమాలు తమ స్థాయిలో టిక్కెట్లు అమ్ముకోవడానికి ప్రయత్నించాయి. అయితే, వీటన్నింటినీ తండేల్ కనీసం రెండింతల రేంజ్‌లో డామినేట్ చేయడం గమనార్హం. సినిమా వచ్చి వారం దాటినా ఇంకా స్టేడిగా ఉండడం విశేషం. లైలా సినిమా రెండో రోజున కేవలం 7,000 టిక్కెట్లు మాత్రమే అమ్ముకోగా, బ్రహ్మానందం మూవీ 8,000 టిక్కెట్‌ బుకింగ్స్‌ను అందుకుంది.

అలాగే, రీ-రిలీజ్ అయిన ఆరెంజ్ సినిమా 7,500 టిక్కెట్‌ సేల్స్‌తో నిలిచింది. కానీ అదే సమయంలో, తండేల్ మాత్రం 53,000 టిక్కెట్లను అమ్ముతూ మిగతా అన్ని సినిమాలను దారుణంగా త్రిప్పకొట్టింది. కేవలం వసూళ్ల పరంగానే కాదు, ప్రేక్షకుల ఆదరణ పరంగా కూడా తండేల్ అగ్రస్థానంలో ఉంది. శుక్రవారం నుంచి శనివారానికి గరిష్ట స్థాయిలో గ్రోత్ చూపించిన ఈ సినిమా, ఆదివారం కూడా మరోసారి భారీ కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉంది.

ఈ సినిమా ఫ్లోను చూస్తే ఈ నెలాఖరు వరకూ బాక్సాఫీస్‌ దున్నేస్తుందని ట్రేడ్ సర్కిల్స్ అంచనా వేస్తున్నాయి. నాగ చైతన్యకు ఇది వరుస ప్లాపుల తర్వాత ఓ గట్టి కమ్‌బ్యాక్ అని చెప్పొచ్చు. సినిమా విడుదలకు ముందు నుంచే బుజ్జి తల్లి, హైలెస్సా పాటలు ట్రెండింగ్‌లో ఉండటం, సినిమాపై అంచనాలను పెంచింది. నాగ చైతన్య, సాయి పల్లవి జంట, చందు మొండేటి టేకింగ్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా సినిమా సక్సెస్ లో కీలకంగా నిలిచాయి.

ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఈ సినిమా బాగా కనెక్ట్ అవ్వడంతో, వీకెండ్ మాత్రమే కాకుండా వర్కింగ్ డేస్‌లోనూ మంచి కలెక్షన్లను రాబట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక నెక్స్ట్ తండేల్ ఏ స్థాయిలో కొనసాగుతుందో చూడాలి. రీ-రిలీజ్ సినిమాలు, కొత్త సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో నిలదొక్కుకోలేకపోతున్నా, తండేల్ మాత్రం మాస్ ఆడియన్స్‌ను కట్టిపడేస్తోంది. ఈ హవా ఇలానే కొనసాగితే, త్వరలోనే టాలీవుడ్‌లో ఓ ట్రెండ్ ను అధిగమించే అవకాశం ఉంది.