'తండేల్' కి కనెక్ట్ అయితే ఇలా ఉంటుంది బాస్!
తాజాగా సినిమాలో ఓ ఎమోషనల్ సన్నివేశం చూసి ఓ యువకుడు కన్నీరు పెట్టుకున్నాడు. దానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.
By: Tupaki Desk | 9 Feb 2025 2:58 PM GMTబాక్సాఫీస్ వద్ద 'తండేల్' ఊచకోత కొనసాగుతోంది. సినిమా రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే 50 కోట్ల క్లబ్ లో చేరి పోయింది. దీంతో 'తండేల్' సెంచరీ కొట్టం పెద్ద విషయం కాదని తేలిపోయింది. థియేటర్లు హౌస్ పుల్ కలెక్షన్లతో రన్ అవుతున్నాయి. అందమైన ప్రేమకథకి దేశ భక్తి నేపథ్యాన్ని మేళవించి తెరకెక్కించిన చిత్రానికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ప్రముఖంగా రాజు-బుజ్జి తల్లి స్వచ్ఛమైన ప్రేమ కథకు ప్రేక్షకులు కనెక్ట్ అయిన విధానం వావ్ అనిపిస్తుంది.
ఇలాంటి ప్యూర్ లవ్ స్టోరీ లు రిలీజ్ అయి చాలా కాలవమవుతుదంటూ థియేటర్ వద్ద ప్రేక్షకులు మాట్లాడు కుంటున్నారంటే? ఆ కథకి ఆడియన్స్ ఎంతగా కనెక్ట్ అవుతున్నారు? అన్నది అద్దం పడుతుంది. ముఖ్యంగా ఈసినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. ఈ విషయాన్ని దర్శకుడు చందు మొండేటి ముందే చెప్పాడు. ఇప్పుడు అతడు చెప్పినట్లే జరుగుతోంది. ఈ లవ్ స్టోరీకి కనెక్ట్ కాని ప్రేమికులు ఉండరని..అలా జరగకపోతే పేరు మార్చుకుంటానని చందు రిలీజ్ కు ముందు సవాల్ విసిరాడు.
చందు చెప్పింది నూటికి నూరు శాతం జరుగుతుంది. ప్రతీ ప్రేమికుడు..ప్రేయసి ఈ కథకి కనెక్ట్ అవుతున్నాడు. తాజాగా సినిమాలో ఓ ఎమోషనల్ సన్నివేశం చూసి ఓ యువకుడు కన్నీరు పెట్టుకున్నాడు. దానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. ఆ వీడియోను నిర్మాత బన్నీ వాసు షేర్ చేసాడు. ప్రేమికులకు, బ్రేకప్ అయిన వారికి ఈ చిత్రం ఇలా కనెక్ట్ అవుతుందని నెటి జనులు కామెంట్లు పెడుతున్నారు.
అయితే ఈ సినిమా ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజును మరింత స్పెషల్ గా హైలైట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఆ రోజు మళ్లీ ప్రేమికులంతా రెండవ సారి, మూడవ సారి చూడటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ప్రతీ ప్రేమికుడు ...ప్రేయసి చూడాల్సిన చిత్రం అంటూ పోస్టులు పెడుతున్న సంగతి తెలిసిందే.