Begin typing your search above and press return to search.

తండేల్ రాజుతో పుష్ప రాజ్.. ప్లాన్ మారింది!

అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న తండేల్ జాతర అట్టహాసంగా జరగాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ వేడుక ప్లాన్ మారింది.

By:  Tupaki Desk   |   1 Feb 2025 9:46 AM GMT
తండేల్ రాజుతో పుష్ప రాజ్.. ప్లాన్ మారింది!
X

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన తండేల్ సినిమా టాలీవుడ్‌లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో మంచి అంచనాలు క్రియేట్ చేసుకుంటోంది. దర్శకుడు చందూ మొండేటి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ హైప్ ను పెంచాయి. ముఖ్యంగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.


ఇక సినిమా ప్రీ రిలీజ్ వేడుక కూడా గ్రాండ్‌గా జరగబోతుండటంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ఈవెంట్‌ను మరింత ప్రత్యేకంగా చేసేందుకు మేకర్స్ చాలా కసరత్తు చేస్తున్నారు. అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న తండేల్ జాతర అట్టహాసంగా జరగాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ వేడుక ప్లాన్ మారింది. ముందుగా ప్లాన్ చేసిన ప్రకారం ఈ ఈవెంట్ ఈ రోజు జరగాల్సి ఉండగా, తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరి 2వ తేదీకి వాయిదా పడింది.

దీనిపై చిత్రబృందం అధికారికంగా ప్రకటన చేసింది. తండేల్ జాతర మరింత గ్రాండ్‌గా, మునుపెన్నడూ లేని విధంగా నిర్వహించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ వేడుకలో అభిమానులకు మరిచిపోలేని అనుభూతిని అందించేందుకు చిత్ర యూనిట్ విశేష కసరత్తు చేస్తోంది. ఈవెంట్‌లో పుష్ప రాజ్ అల్లు అర్జున్ ప్రత్యేక అతిథిగా హాజరవుతుండటంతో బన్నీ ఫ్యాన్స్ కూడా ఈ వేడుకను ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పుష్ప రాజ్ x తండేల్ రాజు అనే థీమ్‌తో ఈ వేడుకను హై లెవెల్‌లో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే చెన్నై, ముంబైలో భారీ ప్రమోషన్స్ చేసిన తండేల్ టీమ్, హైదరాబాద్‌లో జరగనున్న ఈవెంట్‌తో మాస్ ఫీవర్ క్రియేట్ చేయాలని భావిస్తోంది. అయితే ఈ ఈవెంట్ అభిమానులకు ఎంట్రీ అయితే లేదని తెలుస్తోంది.ఈ విషయంపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

ఇటీవల సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో మేకర్స్ భద్రతా చర్యలను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పెద్దసంఖ్యలో అభిమానులు గుమిగూడే అవకాశముండటంతో, ఈవెంట్‌ను ఇండోర్‌లోనే పరిమితం చేసే అవకాశం ఉంది..ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్‌డేట్ హైప్‌ను పెంచుతోంది. ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న తండేల్, నాగ చైతన్య కెరీర్‌లో మరో ప్రత్యేకమైన చిత్రంగా నిలవనుంది. మరి ఈ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఇంకెన్ని సర్ప్రైజ్‌లు దాగున్నాయో చూడాలి.