Begin typing your search above and press return to search.

తండేల్.. ఇక 7 రోజులు బాక్సాఫీస్ జాతరే..

చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను అందుకున్న వారిలో నాగచైతన్య ఒకరు

By:  Tupaki Desk   |   19 Oct 2024 5:01 AM GMT
తండేల్.. ఇక 7 రోజులు బాక్సాఫీస్ జాతరే..
X

చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను అందుకున్న వారిలో నాగచైతన్య ఒకరు. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా తండ్రి తరహాలోనే డిఫరెంట్ కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఇక ఈ మధ్య కాలంలో సరైన హిట్ కోసం వేచి చూస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో భారీ విజయం కోసం ‘తండేల్’ అనే సినిమాతో రాబోతున్నాడు.

ఒక ఎమోషనల్ లవ్ స్టొరీగా రానున్న ఈ సినిమాలో దేశానికి సంబంధించిన మరొక ఆసక్తికరమైన అంశం కూడా హైలెట్ కానుంది. సాయి పల్లవి నాగచైతన్య మధ్యలో వచ్చే లవ్ సీన్స్ మనసుకు హత్తుకునేలా ఉంటాయని పోస్టర్స్ తోనే క్లారిటీ ఇచ్చేశారు. ఇక సముద్రంలో చేపల వేట కోసం వెళ్లి పాకిస్థాన్‌లో జైలు శిక్ష అనుభవించిన శ్రీకాకుళం మత్స్యకారుడి కథను కూడా సినిమాలో చూపించనున్నారు.

నాగ చైతన్య కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ‘తండేల్’ సినిమా నుంచి ఇప్పటికే గ్లింప్స్ వీడియో విడుదలైంది. దీనికి అన్ని వర్గాల నుంచి భారీ స్పందన రావడంతో హైప్ పెరిగింది. అప్పటి నుంచి ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగ చైతన్య సినిమా రిలీజ్ డేట్‌ గురించి రకరకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.

యాక్షన్ అండ్ ఎమోషన్స్‌తో రూపొందుతోన్న ‘తండేల్’ మూవీని డిసెంబర్‌లో విడుదల చేస్తారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఈ మధ్యన మాత్రం ఇది సంక్రాంతి కానుకగా వస్తుందని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం పొంగల్ రేసులోనే నిలవబోతుందని న్యూస్ లీకైంది. దీని ప్రకారం.. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుందట.

‘తండేల్’ మూవీ జనవరి 13నే ఎందుకు రాబోతుంది అన్న దానిపైన కూడా ఓ సమాచారం వైరల్ అవుతోంది. రిలీజ్ రోజున భోగి ఉండడంతో పాటు ఆ తర్వాత వరుసగా పండుగ సెలవులతో పాటు వీకెండ్ కూడా రానుంది.

ఒకసారి హాలిడేస్ ను గమనిస్తే

జనవరి 13 - భోగి

జనవరి 14 - సంక్రాంతి

జనవరి 15 - కనుమ

జనవరి 16 - ముక్కనుమ

జనవరి 17 - శుక్రవారం

జనవరి 18 - శనివారం

జనవరి 19 - ఆదివారం

భోగి రోజు దిగితే మాత్రం తండేల్ కు పర్ఫెక్ట్ డేట్. అందుకే ఆ డేట్‌ను ఫిక్స్ చేశారని అంటున్నారు. ఒకవేళ ఈ మూవీకి మౌత్ టాక్ మంచిగా వస్తే ఈ మూడు రోజుల్లోనే లాభాల బాటలోకి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందని చెప్పొచ్చు. ఇక, నాగ చైతన్య - చందూ మొండేటి కాంబినేషన్‌లో రూపొందుతోన్న ‘తండేల్’ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.