Begin typing your search above and press return to search.

'తండేల్‌' 4 రోజుల కలెక్షన్స్‌

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన 'తండేల్‌' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చందు మొండేటి దర్శకత్వంలో ఈ సినిమాను బన్నీ వాసు నిర్మించారు. అల్లు అరవింద్‌ ఈ సినిమాను సమర్పించారు.

By:  Tupaki Desk   |   11 Feb 2025 8:20 AM GMT
తండేల్‌ 4 రోజుల కలెక్షన్స్‌
X

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన 'తండేల్‌' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చందు మొండేటి దర్శకత్వంలో ఈ సినిమాను బన్నీ వాసు నిర్మించారు. అల్లు అరవింద్‌ ఈ సినిమాను సమర్పించారు. దేవి శ్రీ ప్రసాద్‌ అందించిన సంగీతంకు మంచి మార్కులు దక్కాయి. సినిమా విడుదలకు ముందే బుజ్జి తల్లి, హైలెస్సా పాటలకు మంచి స్పందన దక్కింది. సినిమాపై అంచనాలు పెంచే విధంగా పాటలు ఆకట్టుకున్నాయి. సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. రియల్‌ స్టోరీతో రూపొందించిన సినిమా కావడంతో కాస్త డాక్యుమెంటరీ తరహా ఉంటుందేమో అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.


విడుదల తర్వాత అందరి అంచనాలు తారామారు చేసింది. రియల్‌ స్టోరీని రీల్ లవ్‌ స్టోరీతో మిక్స్ చేసి చూపించడంతో ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా యూత్‌ ఆడియన్స్‌కి కనెక్ట్‌ అయ్యే విధంగా లవ్‌ స్టోరీ ఉండటంతో పాటు, మంచి మ్యూజిక్‌ ఆకట్టుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ని థియేటర్‌కి రప్పించే విధంగా నాగ చైతన్య, సాయి పల్లవిల నటన ఆకట్టుకుంది. రియల్ కథను చక్కని ప్రేమ కథగా మలచిన దర్శకుడు చందు మొండేటిపై ప్రశంసలు కురుస్తున్నాయి. మొదటి మూడు రోజులు వీకెండ్ కావడంతో రికార్డ్‌ స్థాయి వసూళ్లు నమోదు అయ్యాయి. సోమవారం వసూళ్లు డ్రాప్‌ అయ్యే అవకాశం ఉందని కొందరు భావించారు.

వీకెండ్స్‌లో ఎలా అయితే వసూళ్లు దక్కాయో వీక్‌ డేస్‌లోనూ సినిమా భారీ వసూళ్లు సొంతం చేసుకుంది. సోమవారం నాడు ఈ సినిమాకు ఏకంగా 73+ టికెట్లు అమ్ముడు పోయినట్లు బుక్‌ మై షో అధికారికంగా పేర్కొంది. సోమవారం సాలిడ్ కలెక్షన్స్‌ రావడంతో మొదటి నాలుగు రోజుల్లో రూ.73.2 కోట్ల వసూళ్లు సొంతం చేసుకుంది. వీక్‌ డేస్‌లో ఇదే స్ట్రాంగ్‌ కలెక్షన్స్‌ను కంటిన్యూ చేస్తే మరో రెండు మూడు రోజుల్లో సినిమా బ్రేక్‌ ఈవెన్‌ కలెక్షన్స్‌ను చేరే అవకాశాలు ఉన్నాయి. ఇక వీకెండ్‌ పూర్తి కాక ముందే ఈ సినిమా వంద కోట్ల క్లబ్‌లో చేరే అవకాశాలు ఉన్నాయనే నమ్మకంను బాక్సాఫీస్ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.

నాగ చైతన్య కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించబోతున్న సినిమాగా నిలుస్తుందని అల్లు అరవింద్‌ ప్రమోషన్స్‌ సందర్భంగా అన్నారు. ఆయన అన్నట్లుగానే సినిమా రూ.100 కోట్ల వసూళ్లు క్రాస్ చేయడం ఖాయం అని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాలో నాగ చైతన్య కెరీర్‌ బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ ఇచ్చాడు. డాన్స్‌తో పాటు ఎమోషనల్‌ సీన్స్‌లోనూ నాగ చైతన్య ఆకట్టుకున్నాడు. ఇక సాయి పల్లవి గురించి ఎంత చెప్పినా తక్కువే. బుజ్జి తల్లి పాత్రకు ప్రాణం పోసింది. నాగ చైతన్యకు పోటీ ఇచ్చే విధంగా సాయి పల్లవి నటించి మెప్పించింది. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సాధిస్తున్న వసూళ్లు ఇండస్ట్రీ వర్గాల వారిని సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఫిబ్రవరి నెలలో ఈ స్థాయి వసూళ్లు గతంలో ఎప్పుడూ లేవనే టాక్‌ వినిపిస్తుంది. లాంగ్‌ రన్‌లో తండేల్‌ సినిమా వసూళ్లతో సరికొత్త రికార్డ్‌లను నమోదు చేయడం కన్ఫర్మ్‌.