Begin typing your search above and press return to search.

'తండేల్' కోసం ఫిబ్ర‌వ‌రి 14 న రిపీటెడ్ ల‌వ‌ర్స్!

ముఖ్యంగా ఈసినిమా చందు మొండేటి అన్న‌ట్లు ప్రేమికుల‌కు బాగా క‌నెక్ట్ అవుతుంది. రిలీజ్ కి ముందే రిపీటెడ్ ల‌వ‌ర్స్ ఈ సినిమాకి ఉంటార‌ని చెప్పారు.

By:  Tupaki Desk   |   10 Feb 2025 9:30 AM GMT
తండేల్ కోసం ఫిబ్ర‌వ‌రి 14 న రిపీటెడ్ ల‌వ‌ర్స్!
X

నాగ‌చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన `తండేల్` భారీ విజ‌యం దిశ‌గా దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే సినిమా 50 కోట్ల‌కు పై గా వ‌సూళ్ల‌ను సాధించించి వంద కోట్ల వ‌సూళ్లు దిశ‌గా అడుగులు వేస్తోంది. సినిమా భారీ విజ‌యం సాధించడంతో టీమ్ అంతా ఎంతో సంతోషంగా క‌నిపిస్తుంది. చాలా కాలం త‌ర్వాత చైత‌న్య కి మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ ప‌డ‌టంతో అక్కినేని కుటుంబం స‌హా, అభిమానులంతా ఎంతో ఎగ్జైట్ మెంట్ కి గుర‌వుతున్నారు.

ముఖ్యంగా ఈసినిమా చందు మొండేటి అన్న‌ట్లు ప్రేమికుల‌కు బాగా క‌నెక్ట్ అవుతుంది. రిలీజ్ కి ముందే రిపీటెడ్ ల‌వ‌ర్స్ ఈ సినిమాకి ఉంటార‌ని చెప్పారు. ఆయ‌న చెప్పిన‌ట్లే ప్రేమికుల హృద‌యాల్ని సినిమా హ‌త్తుకుంటుంది. ప్రేమికుల ఎడ‌బాటును..భావోద్వేగాల‌ను చందు ఆవిష్క‌రించిన తీరుకు ప్రేమికులంతా ఫిదా అవుతున్నారు. ఓ భగ్న ప్రేమికుడు అయితే థియేటర్లో త‌న ప్రేయ‌సిని గుర్తు చేసుకుని ఎంతో ఎమోష‌న‌ల్ కు గుర‌య్యాడు. ఇప్ప‌టికే ఆ వీడియో నెట్టింట కూడా వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే.

ఇక ఈ సినిమాకు ఫిబ్ర‌వ‌రి 14 ప్రేమికుల దినోత్స‌వం మ‌రింత క‌లిసొచ్చే రోజుగా చెప్పాలి. ప్రేమికుల దినోత్స‌వం వ‌స్తోన్న రోజుల్లోనే సినిమా రిలీజ్ అవ్వ‌డం కూడా క‌లిసొస్తుంది. ఫిబ్ర‌వ‌రి 14కి ఇంకా నాలుగు రోజులు స‌మ‌యం ఉంది. ఈ నేప‌థ్యంలో ఆ స్పెష‌ల్ డేని జంట‌లు తండేల్ థియేట‌ర్లో ఆస్వాదించాల‌ని ప్లాన్ చేసుకుంటున్నారట‌. ల‌వ‌ర్స్ డే రోజున ప‌బ్లిక్ పార్కుల్లో...ప్ర‌దేశాల్లో ప్రేమికులు క‌నిపించ‌డానికి వీలు లేదు.

అలా క‌నిపిస్తే వివిధ సంఘాలు పెళ్లిళ్లు చేసేస్తుంటారు. ప్ర‌ముఖంగా మేజ‌ర్ సిటీస్ లో ఈ సమ‌స్య త‌లెత్తుతుంది. అదే థియేట‌ర్లో అయితే ఎలాంటి స‌మ‌స్య ఉండ‌దు. ప్రేమికుల రోజున ల‌వ్ స్టోరీ చూస్తే అదో మెమోరీగానూ మిగిలి పోతుంది. ఈ నేప‌థ్యంలో వెలెంటైన్స్ డే రోజున చాలా మంది ప్రేమికులు తండేల్ థియేట‌ర్లో ఉండే అవకాశం ఉంటుంది. ఇప్ప‌టికే చాలా మంది ప్రేమికులు తండేల్ వీక్షించారు. కానీ ఫిబ్ర‌వ‌రి 14న రి రిపీటెడ్ ల‌వ‌ర్స్ ఎక్కువ‌గా ఉంటార‌ని మేక‌ర్స్ కూడా భావిస్తున్నారు.