తండేల్.. పాన్ ఇండియా టార్గెట్
ఇది పీరియాడికల్ లవ్ యాక్షన్ డ్రామా కథాంశంతో తెరకెక్కింది. ఎమోషన్ పీక్స్ లో వర్కవుట్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
By: Tupaki Desk | 20 Jan 2025 4:05 AM GMTనిజ జీవిత ఘటనలతో సినిమాలను తెరకెక్కిస్తే ప్రజల్లో బోలెడంత క్యూరియాసిటీ నెలకొంటుంది. అలాంటి ఒక నిజకథతో నాగచైతన్య కథానాయకుడిగా చందు మొండేటి రూపొందిస్తున్న `తండేల్` చాలా కాలంగా చర్చల్లో ఉంది. ఈ సినిమా దాయాది దేశం పాకిస్తాన్ జైలులో మగ్గిన భారతీయ మత్స్యకారుని కథ. అక్కినేని నాగ చైతన్య- సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రాన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించారు. ఇది పీరియాడికల్ లవ్ యాక్షన్ డ్రామా కథాంశంతో తెరకెక్కింది. ఎమోషన్ పీక్స్ లో వర్కవుట్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
ఈ చిత్రం ఫిబ్రవరి 7న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. తాజా సమాచారం మేరకు.. తండేల్ ని పాన్ ఇండియాలో ఒకేసారి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మలయాళ వెర్షన్ ను తెలుగు, తమిళ, హిందీ వెర్షన్లతో పాటు ఒకేసారి విడుదల చేస్తారని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
`తండేల్` ట్రైలర్ కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఎగ్జయిటింగ్ గా వేచి చూస్తున్నారు. జనవరి 26న ట్రైలర్ ని విడుదల చేస్తారని కూడా టాక్ వినిపిస్తోంది. పెండింగ్ చిత్రీకరణను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. నెలాఖరు నుంచి ప్రమోషన్లను ప్రారంభించడానికి తండేల్ బృందం ప్రిపరేషన్ లో ఉందని సమాచారం. హిందీలోను రిలీజ్ చేస్తున్నారు గనుక నాగచైతన్య తన సినిమాని ముంబై సహా పలు ఉత్తరాది నగరాల్లో ప్రమోట్ చేసే వీలుంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్ని వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తండేల్ నేపథ్య సంగీతం ఎమోషనల్ డ్రామాకు తగ్గట్టే, మరో లెవల్లో ఉంటుందని సమాచారం.