నవంబర్ 4న తండేల్ మీడియా మీట్… ఎందుకంటే?
ఇదిలా ఉంటే ఈ మూవీ రిలీజ్ పై క్లారిటీ ఇవ్వడానికి నవంబర్ 4న టీమ్ మీడియా మీట్ నిర్వహించబోతోందంట.
By: Tupaki Desk | 1 Nov 2024 4:23 AM GMTఅక్కినేని నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ 'తండేల్'. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. చైతన్య కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా ఈ చిత్రం రాబోతోంది. ఈ మూవీ కోసం చైతన్య శ్రీకాకుళం స్లాంగ్ నేర్చుకొని తన పాత్రకి డబ్బింగ్ చెప్పుకుంటున్నాడు. అలాగే అన్ని పాత్రలు సిక్కోలు స్లాంగ్ లోనే మాట్లాడనున్నాయి.
ఉత్తరాంధ్రలో మత్స్యకారుల నిజ జీవిత సంఘటల స్ఫూర్తితో ఈ కథని సిద్ధం చేసి తెరపై ఆవిష్కరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నారు. అయితే అదే సమయంలో రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' థియేటర్స్ లోకి వస్తోంది. అలాగే వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ కూడా రిలీజ్ అవుతోంది. 'తండేల్' చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 నిర్మిస్తోంది. అందుకే రామ్ చరణ్ పై పోటీగా మూవీ రిలీజ్ చేసే అవకాశం ఉండకపోవచ్చు అనుకుంటున్నారు.
అలాగే వెంకటేష్ కి చైతన్య మేనల్లుడు కావడంతో మామతో పోటీ పడకపోవచ్చని టాక్ వినిపిస్తోంది. అందుకే మేగ్జిమమ్ మూవీ వాయిదా పడే అవకాశం ఉందని అనుకుంటున్నారు. సినిమాకి ప్రధాన అడ్డంకి ఈ కమిట్మెంట్స్ మాత్రమేనని డైరెక్టర్ చందూ మొండేటి కూడా క్లారిటీ ఇచ్చాడు. వారికి అభ్యంతరం లేకపోతే 'తండేల్' సంక్రాంతికి రిలీజ్ కావడం పక్కా అని చెప్పారు.
ఇదిలా ఉంటే ఈ మూవీ రిలీజ్ పై క్లారిటీ ఇవ్వడానికి నవంబర్ 4న టీమ్ మీడియా మీట్ నిర్వహించబోతోందంట. ఆ రోజు మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తారనే దానిపై పూర్తిగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జనవరి 25ని రిలీజ్ డేట్ చేంజ్ చేసే ఛాన్స్ ఉందనే మాట సోషల్ మీడియాలో వినిపిస్తోంది. అయితే అది ఎంత వరకు సాధ్యం అవుతుందనేది తెలియదు.
చందూ మొండేటి ఈ సినిమా రిలీజ్ కోసం మంచి ప్రైమ్ డేట్ ని చూస్తున్నారు. జనవరి 25న రిలీజ్ చేసిన పెద్దగా కలిసిరాకపోవచ్చని మరో ప్రచారం కూడా నడుస్తోంది. అయితే నవంబర్ 4న మీడియా మీట్ లో అన్ని ప్రశ్నలకి ఒక సమాధానం లభించే అవకాశం అయితే ఉందని అనుకుంటున్నారు. ఒకవేళ మీడియా మీట్ ఉంటే ఈ రెండు రోజుల్లోనే కీలక ప్రకటన చేసే ఛాన్స్ అయితే ఉంది. ఈ చిత్రంలో సాయి పల్లవి ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో వస్తోన్న రెండో సినిమా ఇది కావడం విశేషం.