Begin typing your search above and press return to search.

వీడియో : రేపు వస్తున్నాం దుల్లగొడుతున్నాం

దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన మూడు పాటలు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్‌ హిట్‌ అయ్యాయి.

By:  Tupaki Desk   |   6 Feb 2025 8:04 AM GMT
వీడియో : రేపు వస్తున్నాం దుల్లగొడుతున్నాం
X

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్‌ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చందు మొండేటి దర్శకత్వంలో బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమాను అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు సహజంగానే భారీగా ఉంటాయి. దానికి తోడు చిత్ర యూనిట్‌ సభ్యులు గత రెండు వారాలుగా విభిన్నమైన ప్రమోషన్స్‌తో సినిమాను వార్తల్లో నిలిపారు. అందుకే సినిమా గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. భారీ అంచనాల నడుమ రూపొందిన తండేల్‌ సినిమా సంగీతంకు మంచి స్పందన వచ్చింది. దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన మూడు పాటలు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్‌ హిట్‌ అయ్యాయి.

సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది, ఫైనల్‌ ఔట్‌ పుట్‌ రెడీ అయ్యింది. తాజాగా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా షేర్‌ చేసిన వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వీడియోలో హైలెస్సో పాటకు దేవి శ్రీ ప్రసాద్‌, దర్శకుడు చందు మొండేటి డాన్స్ చేయడం చూడవచ్చు. చాలా సంతోషంగా వారిద్దరూ కనిపిస్తున్నారు. సినిమాపై వారికి ఉన్న నమ్మకం చూస్తుంటే సినిమా కచ్చితంగా సూపర్‌ హిట్‌ అవుతుందని అనిపిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్‌ అవుతుంది.

వస్తున్నాం దుల్లగొడుతున్నాం.. అంటూ దేవి శ్రీ ప్రసాద్‌, చందు మొండేటి వేసిన డాన్స్ వీడియోను షేర్‌ చేశారు. ఎన్నో ఇంటర్వ్యూలు, శ్రీకాకుళంకు చెందిన నిజమైన మత్స్యకారులతో, అక్కడి వారితో ఇంటర్వ్యూలు చేసి విడుదల చేసిన మేకర్స్ ఈ వీడియోను షేర్‌ చేయడంతో సినిమాపై మరింతగా నమ్మకం కలిగించారు. కచ్చితంగా సినిమా రేపు హిట్‌ టాక్‌ దక్కించుకుంటుంది అనే విశ్వాసంను వారు వ్యక్తం చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమా భారీ బ్లాక్ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకుంటే, ఆ తర్వాత తండేల్‌ ఊహకు అందని వసూళ్లు సాధిస్తుందనే విశ్వాసం వ్యక్తం అవుతోంది.

పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కాబోతున్న ఈ సినిమా చైతూ కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టబోతున్న సినిమాగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఇప్పటికే వచ్చిన లవ్‌ స్టోరీ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కనుక మరో సారి వీరి కాంబోకి హిట్‌ పడటం ఖాయం అనిపిస్తుంది. నిజ జీవితంలో జరిగిన సంఘటనలు తీసుకుని ఒక మంచి లవ్‌ స్టోరీని రూపొందించినట్లు దర్శకుడు చందు మొండేటి చెప్పుకొచ్చాడు. కార్తికేయ 2 సినిమా వంద కోట్లకు మించి వసూళ్లు సాధించిన నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు అంతకు మించి ఉన్నాయి. తండేల్‌ సినిమా మరికొన్ని గంటల్లో సందడి మొదలు పెట్టబోతుంది. యూనిట్‌ సభ్యులు అన్నట్లుగా దుల్లగొడుతుందా అనేది తెలియాల్సి ఉంది.