తండేల్ పైరసీ.. వాళ్లు జైలుకి వెళ్లక తప్పదు..!
ఐతే ఈ సినిమా రిలీజ్ నాడే హెచ్.డి ప్రింట్ పైరసీ అయ్యింది. దీనిపై నిర్మాతలు సీరియస్ యాక్షన్ కి దిగుతున్నారు.
By: Tupaki Desk | 10 Feb 2025 2:20 PM GMTనాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా తండేల్. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో అల్లు అరవింద్ సమర్పించగా బన్నీ వాసు నిర్మించారు. తండేల్ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఐతే ఈ సినిమా రిలీజ్ నాడే హెచ్.డి ప్రింట్ పైరసీ అయ్యింది. దీనిపై నిర్మాతలు సీరియస్ యాక్షన్ కి దిగుతున్నారు.
తండేల్ పైరసీ గురించి నిర్మాతలు బన్నీ వాసు, అల్లు అరవింద్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సినిమా పైరసీని ఎంకరేజ్ చేయొద్దని దానికి కారణమైన వారిని వదిలిపెట్టేది లేదని అన్నారు బన్నీ వాసు. ఇక అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఈమధ్య కాలంలో లేనిది దిల్ రాజు సినిమాతో ప్రారంభమైంది. ఇదివరకు చాంబర్ లో ఒక సెల్ ఉండేది. పైరసీ అది చిన్నదైనా పెద్దదైనా వస్తే వాళ్లు డౌన్ చేస్తూ ఉంటారు. వాళ్లకు మేము కొంత అమౌంట్ పే చేస్తాం.
పగలు రాత్రి వాళ్లు అదే పనిచేస్తారు. ఐతే ఇప్పుడు మళ్లీ ఆ సెల్ ని ఏర్పాటు చేశాం. వాళ్లు పని మొదలు పెట్టారు. ఐతే తండేల్ సినిమా ముఖ్యంగా మంచి ప్రింట్ బయటకు వచ్చింది. వీటితో పాటుగా వాట్సాప్, టెలికాం గ్రూపుల్లో పంపిస్తున్నారు. ఆల్రెడీ కొంతమంది అడ్మిన్ లను పసి గట్టాం.. వాళ్లను త్వరలో సైబర్ క్రైమ్ వారు అరెస్ట్ చేస్తారు. గ్రూపుల్లో పంపించే అడ్మిన్స్ జాగ్రత్తగా ఉండండి. మీరు జైలుకి వెళ్లే అవకాశం ఉంది. ఈసారి పట్టుబట్టి ఉన్నా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఇది ఒక క్రైమ్ అని అన్నారు అల్లు అరవింద్.
ఇదివరకు కన్నా సైబర్ సెల్స్ ఇప్పుడు బాగా పనిచేస్తున్నాయి. సరదాగా వెబ్ సైట్స్ లో పెడుతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో కూడా వేస్తున్నారు. అది వారి అమాయకత్వం. ఐతే ఈ విషయంలో ప్రేక్షకులు తమకు సహకరించాలని కోరారు అల్లు అరవింద్. ఒక సినిమా రిలీజ్ కాగానే రిలీజ్ నాడే పైరసీ ప్రింట్ రకరకాల సైట్స్ లో పెట్టేస్తున్నారు. ఐతే తండేల్ విషయంలో మంచి క్వాలిటీ ప్రింట్ పైరసీ అవ్వడం చిత్ర యూనిట్ కి షాక్ ఇచ్చింది. ఐతే దీని వెనుక ఉన్న వారిని అసలు వదిలిపెట్టేది లేదని నిర్మాతలు చెబుతున్నారు.