Begin typing your search above and press return to search.

తండేల్ ఓటీటీ రిలీజ్‌పై లేటేస్ట్ అప్డేట్

ఎంతో కాలంగా ఫ్లాపుల‌తో ఇబ్బంది ప‌డుతున్న నాగ చైత‌న్య తండేల్ సినిమాతో సాలిడ్ కం బ్యాక్ ఇచ్చాడు.

By:  Tupaki Desk   |   19 Feb 2025 11:54 AM GMT
తండేల్ ఓటీటీ రిలీజ్‌పై లేటేస్ట్ అప్డేట్
X

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైత‌న్య హీరోగా సాయి ప‌ల్ల‌వి హీరోయిన్ గా వ‌చ్చిన సినిమా తండేల్. చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా అంద‌రి అంచ‌నాల‌ను అందుకోవ‌డమే కాకుండా చైత‌న్య కెరీర్లోనే అతి పెద్ద గ్రాస‌ర్ గా నిలిచింది. ఎంతో కాలంగా ఫ్లాపుల‌తో ఇబ్బంది ప‌డుతున్న నాగ చైత‌న్య తండేల్ సినిమాతో సాలిడ్ కం బ్యాక్ ఇచ్చాడు.

తండేల్ మూవీ చాలా త‌క్కువ టైమ్ లోనే రూ.100 కోట్ల క్ల‌బ్ లో చేరి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. గ‌త వారం రిలీజైన సినిమాలు కూడా ఏవీ మంచి టాక్ తెచ్చుకోక‌పోవ‌డంతో తండేల్ ఇప్ప‌టికీ మంచి ఆక్యుపెన్సీల‌తో థియేటర్ల‌లో ర‌న్ అవుతుంది. చూస్తుంటే తండేల్ హ‌వా ఇంకొన్ని రోజుల పాటూ కంటిన్యూ అయ్యేలా ఉంది.

సినిమా ఇంకా థియేట‌ర్ల‌లో ర‌న్ అవుతుండ‌గానే చాలా మంది తండేల్ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే తండేల్ ఓటీటీ రిలీజ్‌పై ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ వినిపిస్తోంది. తండేల్ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైన నెల రోజుల‌కే ఓటీటీలోకి రానున్న‌ట్టు వార్త‌లొస్తున్నాయి. ఫిబ్ర‌వ‌రి 7న తండేల్ థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది.

దీన్ని బ‌ట్టి మార్చి 7న తండేల్ ఓటీటీలోకి రానుందని అంటున్నారు. తండేల్ ఓటీటీ రిలీజ్ పై ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి అధికారిక ప్రక‌ట‌న వ‌చ్చింది లేదు. అయితే ఈ సినిమా డిజిట‌ల్ రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్ భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసిన‌ట్టు తెలుస్తోంది. చిత్ర ప్ర‌మోష‌న్స్ టైమ్ లో స్వ‌యంగా డైరెక్ట‌ర్ చందూనే ఈ విష‌యాన్ని చెప్తూ, ఓటీటీ డీల్ తోనే ఈ సినిమా బ‌డ్జెట్ లో స‌గానికి పైగా రిక‌వ‌రీ అయింద‌ని వెల్ల‌డించాడు.

నిజానికి సినీ ఇండ‌స్ట్రీకి ఫిబ్ర‌వ‌రి అనేది డ్రై సీజ‌న్. అన్ సీజ‌న్ లో రిలీజైనా, మూవీ రిలీజైన మొద‌టి రోజే పైర‌సీ ద్వారా హెచ్‌డీ వెర్ష‌న్ వ‌చ్చినా అవేవీ తండేల్ స‌క్సెస్ పై ప్ర‌భావం చూపలేక‌పోయాయి. ఇప్ప‌టికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయి, లాభాలందుకున్న తండేల్ సినిమా యదార్థ జీవిత సంఘ‌ట‌నల ఆధారంగా రూపొందింది.