Begin typing your search above and press return to search.

తండేల్.. మొత్తం సొంతంగానే..

ప్రమోషన్స్ కు మంచి రెస్పాన్స్ రావడం.. వీటిని దృష్టిలో పెట్టుకుని తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్స్ థియేట్రికల్ రైట్స్ కోసం పోటీపడ్డారని సమాచారం.

By:  Tupaki Desk   |   4 Feb 2025 10:27 AM GMT
తండేల్.. మొత్తం సొంతంగానే..
X

టాలీవుడ్ యంగ్ హీరో, యువసామ్రాట్ నాగచైతన్య, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి మరోసారి జంటగా సందడి చేయనున్న మూవీ తండేల్. శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యలేశం గ్రామంలో జరిగిన ఘటన ఆధారంగా చందూ మొండేటి తెరకెక్కించగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు.

అయితే అనౌన్స్మెంట్ నుంచి ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొల్పిన తండేల్ పై ఇప్పుడు వేరే లెవెల్ పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యి ఉంది. మేకర్స్ వివిధ రకాలుగా సినిమాను ప్రమోట్ చేస్తూ హైప్ క్రియేట్ చేస్తున్నారు. సాంగ్స్, గ్లింప్స్, పోస్టర్స్ తో అలరిస్తున్నారు. ప్రమోషనల్ కంటెంట్ తో అందరి దృష్టి తమ సినిమా వైపు ఈజీగా తిప్పుకుంటున్నారు.

అదే సమయంలో తండేల్ వరల్డ్ వైడ్ రిలీజ్ కు మేకర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫిబ్రవరి 7వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కానుంది చిత్రం. అయితే ఇప్పుడు సినిమా డిస్ట్రిబ్యూషన్ పై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. ఎందుకంటే.. తండేల్ ను రిలీజ్ చేసేందుకు భారీ సంఖ్యలో డిస్ట్రిబ్యూటర్స్ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.

రియల్ స్టోరీతో మూవీ తెరకెక్కడం.. చైతూ- సాయి పల్లవి జోడీకి క్రేజ్ ఉండడం.. పాన్ ఇండియా హిట్ కార్తికేయ-2 తర్వాత చందూ చేస్తున్న సినిమా కావడం.. అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మించడం.. ప్రమోషన్స్ కు మంచి రెస్పాన్స్ రావడం.. వీటిని దృష్టిలో పెట్టుకుని తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్స్ థియేట్రికల్ రైట్స్ కోసం పోటీపడ్డారని సమాచారం.

కానీ మేకర్స్ మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో మినిమమ్ గ్యారంటీలు కానీ థియేటర్ల లెక్కన ఎగ్జిబిటర్లకు కానీ మూవీ ఇవ్వొద్దని నిర్ణయించుకున్నారట. కచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని, అందుకే అలా చేస్తే ఆదాయం తగ్గుతుందని గ్రహించి నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారని ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్.

దీంతో ఇప్పుడు తండేల్.. అన్ని ఏరియాల్లో రెంట్ బేసిస్ పైనే రిలీజ్ అవుతున్నట్లు తెలుస్తోంది. అంటే గీతా ఆర్ట్స్ సంస్థ సొంతంగా రిలీజ్ చేస్తున్నటే. అయితే రూ.90 కోట్ల బడ్జెట్ తో మూవీ నిర్మించగా.. రూ.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. అంటే థియేటర్స్ లో రూ.40 కోట్ల షేర్ రాబడితే తండేల్ హిట్ గా మారుతుంది. ఇప్పుడు ఉన్న బజ్ బట్టి అది పెద్ద కష్టం కాదనే చెప్పాలి. మరేం జరుగుతుందో వేచి చూడాలి.