Begin typing your search above and press return to search.

తండేల్ కోసం దేవి..మొదట బన్నీ ఏమన్నాడంటే..

నిర్మాత అల్లు అరవింద్ కూడా 'తండేల్' మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ చిత్రంపై ఆయన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

By:  Tupaki Desk   |   1 Feb 2025 2:28 PM GMT
తండేల్ కోసం దేవి..మొదట బన్నీ ఏమన్నాడంటే..
X

నాగ చైతన్య, సాయి పల్లవి జోడీగా గీతా ఆర్ట్స్ 2పైన బన్నీ వాస్ నిర్మించిన భారీ బడ్జెట్ మూవీ 'తండేల్' ఫిబ్రవరి 7న థియేటర్స్ లోకి వస్తోంది. ఏకంగా ఐదు భాషలలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం యాక్టివ్ గా జరుగుతున్నాయి. నిర్మాత అల్లు అరవింద్ కూడా 'తండేల్' మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ చిత్రంపై ఆయన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

ఈ మూవీ నుంచి వచ్చిన సాంగ్స్ అన్ని సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా హీరో, హీరోయిన్స్ మధ్య నడిచే లవ్ సాంగ్స్ అయితే ప్రేక్షకుల బాగా కనెక్ట్ అయ్యాయి. దేవిశ్రీ ప్రసాద్ బెస్ట్ ఆల్బమ్ ఇచ్చాడనే మాట అందరి నోటి నుంచి వినిపిస్తోంది. ఇక అల్లు అరవింద్ కూడా ఈ సినిమా మ్యూజిక్ గురించి ఆసక్తికరమైన విషయాన్ని రివీల్ చేశారు.

'తండేల్' మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీప్రసాద్ ని ఎంపిక చేయడం వెనుక అల్లు అర్జున్ నిర్ణయం ఉందని చెప్పారు. నిజానికి 'తండేల్', 'పుష్ప 2' సినిమా వర్క్ సమాంతరంగా జరగడంతో దేవిశ్రీ ప్రసాద్ పూర్తిగా దృష్టి పెట్టలేడని తాను భావించినట్లు అల్లు అరవింద్ చెప్పారు. 'పుష్ప 2'పైన ఆయన ఫోకస్ అంతా ఉంటుందని అనుకున్నాం. అయితే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరని అనుకుంటున్నారు అన్ని బన్నీ అడిగారు.

తమ ఆలోచనని బన్నీతో చెప్పడం జరిగింది. దేవిశ్రీప్రసాద్ అయితే న్యాయం చేయలేడనే అభిప్రాయం వ్యక్తం చేసాం. లవ్ స్టోరీకి దేవిశ్రీ ప్రసాద్ బెస్ట్ ఛాయస్. అతన్నే ఫైనల్ చేయాలని బన్నీ సూచించారు. మేము కూడా బన్నీ నిర్ణయానికి ఓకే చెప్పాం అని అల్లు అరవింద్ స్పష్టం చేశారు. ఆలా ఈ సినిమా మ్యూజిక్ విషయంలో పరోక్షంగా బన్నీ ఇన్వాల్వ్ మెంట్ ఉందని ఇంటర్వ్యూలో అల్లు అరవింద్ చెప్పారు.

బన్నీ నిర్ణయం కరెక్ట్ అని దేవిశ్రీప్రసాద్ తన సాంగ్స్ తో ప్రూవ్ చేసుకున్నాడు. 'తండేల్' సినిమాకి బెస్ట్ సాంగ్స్ ఇచ్చి సినిమాపై హైప్ క్రియేట్ చేసాడు. ఈ సినిమాకి సాయి పల్లవి డాన్స్ పెర్ఫార్మెన్స్, మూవీ బ్యాక్ డ్రాప్ ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతున్నాయి. నాగ చైతన్య కెరియర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ ఈ సినిమాకి వస్తాయని భావిస్తున్నారు. చందూ మొండేటి కూడా ఈ మూవీ కథని తెరపై అద్భుతంగా ఆవిష్కరించాడని ట్రైలర్ బట్టి తెలుస్తోంది.