USA లో ‘తండేల్’ కలెక్షన్స్.. గుడ్ స్టార్ట్!
ముఖ్యంగా నాగచైతన్య కెరీర్‌లో ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకునే సినిమా అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.
By: Tupaki Desk | 7 Feb 2025 5:08 PM GMTఅక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన తండేల్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రారంభం నుంచే భారీ అంచనాలు నెలకొల్పింది. ట్రైలర్‌తోనే కథపై ఆసక్తిని పెంచిన తండేల్, రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా అందర్నీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా నాగచైతన్య కెరీర్‌లో ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకునే సినిమా అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.
ఇప్పటి వరకు ప్రేమ కథలు, యూత్‌ఫుల్ సినిమాలకే పరిమితమైన చైతూ, ఈసారి పూర్తి భిన్నమైన కథను ఎంచుకున్నాడు. మత్స్యకారుల జీవితాలను ఆవిష్కరించే కథగా తండేల్ రూపొందింది. ఇందులో నాగచైతన్య పాత్ర ఎమోషనల్‌గా ఉండటమే కాకుండా, మాస్ ఆడియన్స్‌ను కూడా అలరించేలా ఉంది. కెరీర్‌లో మొదటిసారి ఇంత విభిన్నమైన పాత్రలో నటిస్తూ తన రేంజ్‌ను పెంచుకున్నాడు. ఇప్పటివరకు నటనపై విమర్శలు చేసిన వారిని కూడా ఈ సినిమా ద్వారా చైతూ నిరూపించుకున్నాడు.
అయితే ఈ సినిమా ఓపెనింగ్స్ పరంగా కూడా అదిరిపోయే రీతిలో దూసుకుపోతోంది. యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే $300K మార్క్ దాటి, అద్భుతమైన వసూళ్లు సాధిస్తోంది. విడుదలైన కొన్ని గంటల్లోనే మంచి ఆరంభాన్ని ఇచ్చింది. ఇక తండేల్ కలెక్షన్ల పరంగా మరింత దూసుకెళ్లే అవకాశం ఉంది. ఇక విజువల్ ట్రీట్, ఎమోషనల్ యాక్షన్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి.
గీతా ఆర్ట్స్ సమర్పణలో తెరకెక్కిన ఈ సినిమా, యూఎస్ లో మంచి రెస్పాన్స్ ను అందుకుంటోంది. సినిమా ప్రీమియర్ షోల నుంచే పాజిటివ్ టాక్ అందుకుంటూ, ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. యాక్షన్ ఎపిసోడ్స్, రొమాంటిక్ ఎమోషన్స్, విజువల్ గ్రాండియర్ కలిసి సినిమా మొత్తాన్ని కొత్త లెవల్‌కు తీసుకెళ్లాయి. ముఖ్యంగా నాగచైతన్య, సాయిపల్లవి జంట మరోసారి మాయాజాలం సృష్టించిందని టాక్ వస్తోంది.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, సినిమాకు అదనపు ఆకర్షణగా మారింది. ఇదివరకెన్నడూ లేని విధంగా నాగచైతన్య కెరీర్‌లో ఇది బిగ్గెస్ట్ రిలీజ్ అని చెప్పవచ్చు. ఇక టాలీవుడ్‌లోనే కాకుండా ఇతర భాషల్లోనూ సినిమా మంచి ఓపెనింగ్స్ సాధిస్తోంది. బాక్సాఫీస్ వద్ద మూడురోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించే స్థాయికి వెళ్తోంది. అలాగే నాగచైతన్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలవనుంది.