Begin typing your search above and press return to search.

తండేల్ సంక్రాంతి ట్విస్ట్.. ప్లాన్ సెట్టయినట్లేనా..?

నాగచైతన్య చందు మొండేటి కాంబినేషన్లో రాబోతున్న తండేల్ సినిమాపై ఇప్పటికే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి.

By:  Tupaki Desk   |   15 Oct 2024 11:30 AM GMT
తండేల్ సంక్రాంతి ట్విస్ట్.. ప్లాన్ సెట్టయినట్లేనా..?
X

నాగచైతన్య చందు మొండేటి కాంబినేషన్లో రాబోతున్న తండేల్ సినిమాపై ఇప్పటికే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి. మత్స్యకారుల నిజ జీవితంలోనే కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరపైకి తీసుకురాబోతున్నారు. ఈ సినిమా పోస్టర్స్ కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసుకున్నాయి. అలాగే నాగచైతన్య కూడా ఈ చాలా డిఫరెంట్ గా కనిపిస్తూ ఉన్నాడు.

లవ్ స్టొరీ అనంతరం సాయి పల్లవి కూడా ఇందులో నాగచైతన్యకు జోడిగా నటిస్తోంది. మొత్తానికి హిట్ కాంబినేషన్ కావడంతో ఈ సినిమా ఎప్పుడు వచ్చినా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అయితే అందుకునే అవకాశం ఉంటుంది. ఇక అందులోనూ హాలిడేస్ టైం లో వస్తే అసలు తిరుగుండదని చెప్పవచ్చు. అందుకే ఇప్పుడు ఈ సినిమా కూడా సంక్రాంతి టైమ్ లో రావడానికి అడుగులు వేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

అసలైతే ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేయాలని అనుకున్నారు. క్రిస్టమస్ సందర్భంగా ఒక టార్గెట్ సెట్ చేసుకున్న చిత్ర యూనిట్ ఇప్పటికే సినిమా పనులను ప్లాన్ ప్రకారం ఫినిష్ చేస్తోంది. బ్యాలెన్స్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా వీలైనంత తొందరగా ఫినిష్ చేయాలని అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు సంక్రాంతిని టార్గెట్ చేయడంతో విషయం హాట్ టాపిక్ గా మారింది.

ఇప్పటికే ఆ సీజన్ లో గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇక నందమూరి బాలకృష్ణ 109వ సినిమా కూడా అదే టైమ్ లో రాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం' కూడా పండక్కు రావలసిన సినిమా. ఇక ఇప్పుడు నాగచైతన్య హిట్ కాంబినేషన్ కూడా పొంగల్ భరిలో నిలిస్తే అక్కినేని ఫ్యాన్స్ కు కూడా ఫెస్టివల్ చాలా ప్రత్యేకంగా ఉంటుందని చెప్పవచ్చు.

నిజానికి సంక్రాంతి సీజన్ లో నాలుగైదు సినిమాలకు మంచి స్పేస్ అయితే ఉంటుంది. పోటీ ఎంత ఉన్నా కూడా టాక్ బాగుంటే ఆడియన్స్ అన్ని సినిమాలను ఆదరిస్తారని చాలాసార్లు రుజువైంది. కాబట్టి తండేల్ పండగ టైమ్ ను టార్గెట్ చేయడంలో తప్పు లేదు. ప్రస్తుతం నిర్మాతలు ఈ విషయంపై చర్చలు జరుపుతున్నారు. ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. చర్చలు ముగిసిన తర్వాత త్వరలోనే ఒక అప్డేట్ ఇచ్చే అవకాశం ఉంది.