భారత్-పాకిస్తాన్ మధ్య తండేల్ లవ్ స్టోరీ!
నాగచైతన్య కథనాయకుడిగా చందు మొండేటి దర్శకత్వంలో `తండేల్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 2 Feb 2024 12:30 AM GMTనాగచైతన్య కథనాయకుడిగా చందు మొండేటి దర్శకత్వంలో `తండేల్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మత్సకారుల జీవితంలో జరిగిన కొన్ని వాస్తవం సంఘటనల్ని ఆధారంగా చేసుకుని చిత్రాన్ని తెరకెక్కి స్తున్నారు. ప్రారంభానికి ముందు చైతన్య..చందు ఎంతగా రీసెర్చ్ చేసారో తెలిసిందే. నేరుగా బాధిత కుటుంబాల్ని కలిసి జరిగిన పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. ఆ పాత్రకి ఎలా సన్నదం అవ్వాలన్నది నాగచైతన్య ముందుగానే ప్రీపేర్ అయి రంగంలోకి దిగాడు.
పాత్రల్లో ఆత్మని పట్టుకోవడం కోసమే చైతన్య కూడా నేరుగా హాజరయ్యాడు. ప్రస్తుతం సినిమా సెట్స్ లో ఉంది. ఇప్పటికే గురి తప్పేదేలే అంటూ తండేల్ ప్రపంచాన్ని ఓ ప్రచార చిత్రంతో ఆవిష్కరించారు. సముద్రం నేపథ్యంలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. కర్నాటక..గోవా తదితర ప్రాంతాల్లో ఇటీవల కొన్ని పోరాట ఘట్టాల్ని..టాకీ తెరకెక్కించారు. అయితే ఇంతవరకూ ఈ సినిమా కేవలం యాక్షన్ ప్రధానం గానే తెరకెక్కుతుందని వెలుగులోకి వచ్చింది. కానీ ఇందులో అద్భుతమైన లవ్ స్టోరీ ఉందని తాజాగా తెలుస్తోంది.
భారత్ -పాకిస్తాన్ మధ్య ప్రధానంగా ఓ ప్రేమ కథనే హైలైట్ చేస్తున్నట్లు లీకులందుతున్నాయి. సినిమాలో లవ్ స్టోరీపైనే దర్శకుడు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం ఇంతవరకూ ఎక్కడా హైలైట్ కాలేదు. వాస్తవ సంఘటనలు అనగానే ప్రాదేశిక సముద్ర జలాల నేపథ్యంలో అక్రమంగా చొరబడిన అంశాన్నే మెయిన్ థీమ్ గా తీసుకుంటున్నారని అంతా భావించారు. కానీ సినిమాలో లవ్ స్టోరీని బేస్ చేసుకుని మిగతా కథని నడిపిస్తున్నట్లు తాజాగా వెలుగులోకి వస్తోంది.
లవ్ స్టోరీలైనా చందు అద్భుతంగా ఆవిష్కరించల గల దర్శకుడే. చైతన్యతో `ప్రేమమ్ `ని రీమేక్ చేసింది అతడే. ఆ సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తండేల్ లవ్ స్టోరీ అంతే ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అయితే ఈ లవ్ స్టోరీలో హీరో ఇండియన్ నా? లేక పాకిస్తా నీయుడా? అన్నది సస్పెన్స్.