Begin typing your search above and press return to search.

తండేల్ కోసం గట్టిగానే దింపుతున్నారు

నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తండేల్ మూవీ షూటింగ్ దశలో ఉంది.

By:  Tupaki Desk   |   27 Aug 2024 4:30 AM GMT
తండేల్ కోసం గట్టిగానే దింపుతున్నారు
X

నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తండేల్ మూవీ షూటింగ్ దశలో ఉంది. పాన్ ఇండియా లెవల్ లో భారీ బడ్జెట్ తో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 70 కోట్ల వరకు ఈ సినిమా కోసం ఖర్చు చేస్తున్నారంట. సాయి పల్లవి ఈ మూవీలో ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. శ్రీకాకుళం నేపథ్యంలో తండేల్ మూవీ కథ ఉంటుంది. రియల్ లైఫ్ సంఘటనల స్ఫూర్తితో ఈ కథని సిద్ధం చేశారు.

నాగ చైతన్య క్యారెక్టర్ కూడా రియల్ లైఫ్ నుంచే తీసుకున్నారంట. రాజు అనే వ్యక్తి లైఫ్ లో జరిగిన నిజజీవిత సంఘటనలకి కాస్తా ఫిక్షన్ జోడించి తండేల్ మూవీని రెడీ చేస్తున్నారు. ఈ సినిమాలో నాగ చైతన్య ఫిషర్ మెన్ గా కనిపించబోతున్నాడు. సముద్రంపై వేటకి వెళ్లి పాకిస్థాన్ జైల్లో బందీ అయిపోయిన ఒక మత్స్యకారుడిగా నాగ చైతన్య పాత్ర ఉంటుందంట. ఇప్పటికే కీలక షెడ్యూల్స్ ని విశాఖపట్నం, శ్రీకాకుళం నేపథ్యంలో తెరకెక్కించారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీలో జాతర ఎపిసోడ్ కోసం భారీ ఖర్చుతో హైదరాబాద్ లో పెద్ద సెట్ వేశారు. ఈ జాతర కోసం 60 మంది కళాకారులని శ్రీకాకుళం నుంచి తీసుకొచ్చారట. అలాగే జూనియర్ ఆర్టిస్ట్స్, డాన్సర్స్ కలిపి 900 మంది వరకు ఈ జాతర ఎపిసోడ్ లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. అదిరిపోయే రేంజ్ లో ఫోక్ బీట్ సాంగ్ కూడా ఉంటుందంట. దేవిశ్రీ ప్రసాద్ ఈ జాతర ఎపిసోడ్ కోసం గూస్ బాంబ్స్ క్రియేట్ చేసే మ్యూజిక్ అందించారని తెలుస్తోంది.

నాగ చైతన్య కెరియర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో తండేల్ సినిమా తెరకెక్కుతోంది. మూవీలో కథ డిమాండ్ మేరకు ఈ స్థాయిలో ఖర్చు చేస్తున్నారంట. డిసెంబర్ 20న తండేల్ సినిమాని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. సినిమాపైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. విరాటపర్వం తర్వాత సాయి పల్లవి తెలుగులో చేస్తోన్న సినిమా తండేల్ కావడంతో ఆమె డాన్స్ నెంబర్స్ ని ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

పక్కా శ్రీకాకుళం ఫిషర్ మెన్ కమ్యూనిటీ అమ్మాయిగా సాయి పల్లవి ఈ చిత్రంలో కనిపించబోతోందని ఆమె ఫస్ట్ లుక్ బట్టి స్పష్టం అవుతోంది. అలాగే లవ్ స్టోరీ తర్వాత నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో వస్తోన్న సినిమా కావడంతో ప్రేక్షకులలో తండేల్ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో క్లిక్కవుతుందో చూడాలి.