Begin typing your search above and press return to search.

ఇంతకీ 'తండేల్' రిలీజ్ టార్గెట్ ఏంటి?

నాగ చైతన్య కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతోన్న డిఫరెంట్ కంటెంట్ మూవీ తండేల్

By:  Tupaki Desk   |   25 Jan 2024 4:14 AM GMT
ఇంతకీ తండేల్ రిలీజ్ టార్గెట్ ఏంటి?
X

నాగ చైతన్య కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతోన్న డిఫరెంట్ కంటెంట్ మూవీ తండేల్. చందూ మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా సిద్ధం అవుతోంది. మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి తండేల్ మూవీలో నటిస్తూ ఉండటంతో సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ హై ఎండ్ లో ఉన్నాయి. రీసెంట్ గా వచ్చిన మూవీ ఫస్ట్ గ్లింప్స్ కూడా సినిమా అంచనాలు పెంచేసింది.

కచ్చితంగా ఈ చిత్రం చైతూ కెరియర్ లోనే బెస్ట్ మూవీగా ఉండే అవకాశాలు ఉన్నాయనే మాట ఇండస్ట్రీ సర్కిల్ లో వినిపిస్తోంది. శ్రీకాకుళం, పాకిస్తాన్ మధ్య బంగాళాఖాతం నేపథ్యంలో మత్స్యకార కమ్యూనిటీలో జరిగిన నిజ జీవిత సంఘటనల స్పూర్తితో ఈ కథని రైటర్ సిద్ధం చేశారు. చాలా కాలం గా ఈ స్క్రిప్ట్ పై వర్క్ జరిపారు. ఇక చందు మొండేటి ఈ సినిమా కోసం చాలా రోజులు వర్క్ షాప్ కూడా చేశారు.

దానికి తగ్గట్లుగానే అద్భుతమైన విజువలైజేషన్ తో కథని చందూ మొండేటి ప్రెజెంట్ చేస్తున్నారు. చైతూ ఈ మూవీలో పాకిస్తాన్ జైల్లో బందీ అయిన మత్స్యకార యువకుడిగా కనిపిస్తున్నాడు. అతని ప్రేయసిగా సాయి పల్లవి కనిపించబోతోంది. వీరిద్దరి లవ్ స్టొరీతో పాటు దేశభక్తిని పెంచే ఎలిమెంట్స్ కూడా తండేల్ లో బలంగా ఉంటాయని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా రిలీజ్ గురించి గీతా ఆర్ట్స్ ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటుంది. పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతోన్న ప్రాజెక్ట్ కాబట్టి కరెక్ట్ డేట్ సెట్ చేసే పనిలో ఉన్నారు. ఆగష్టు లేదా సెప్టెంబర్ లో మూవీ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారంట. ముందుగానే ఈ మూవీ కోసం వర్క్ షాప్స్ చేయడంతో చందూ మొండేటి గ్యాప్ లేకుండా షూటింగ్ ఫినిష్ చేసే పనిలో ఉన్నారంట.

ఏ పెద్ద సినిమాతోను క్లాష్ లేకుండా అన్ని భాషల్లో క్లిక్కయ్యేలా సినిమాను విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. అంతే కాకుండా కంటెంట్ కూడా అన్ని వర్గాల వారికి కనెక్ట్ అయ్యేలా ఉండడంతో సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సాలీడ్ కలెక్షన్లు అందుకుంటుందంని అంచనాలు ఏర్పడుతున్నాయి. టీమ్ అయితే చాలా కాన్ఫిడెంట్ తో కనిపిస్తోంది.

చాలా తక్కువ రోజుల షూటింగ్ లోనే అదిరిపోయే గ్లింప్స్ ఇవ్వడంతో అవుట్ పుట్ మీద అల్లు అరవింద్, బన్నీ వాస్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే వీలైనంత తక్కువ టైంలో మూవీ షూటింగ్ కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది.