Begin typing your search above and press return to search.

ఆయ్ ఫన్ ఫెస్టివల్‌లో తండేల్ టీమ్..!

ఈమధ్యనే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ చిత్ర యూనిట్‌ను ప్ర‌త్యేకంగా క‌లిసి విషెష్ అందించారు.

By:  Tupaki Desk   |   20 Aug 2024 4:56 PM GMT
ఆయ్ ఫన్ ఫెస్టివల్‌లో తండేల్ టీమ్..!
X

ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో నార్నే నితిన్‌ లీడ్ రోల్ లో నటించిన సినిమా ఆయ్. నితిన్ కి జతగా న‌య‌న్ సారిక హీరోయిన్ గా నటించింది. రీసెంట్ గా ఆగ‌స్ట్ 15న రిలీజైన ఈ సినిమా మొదటి షో నుంచి తొలి ఫన్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల మనసలు గెలుచుకుంది.థియేట‌ర్స్‌లో సక్సెస్ ఫుల్ గా సంద‌డి చేసృన్న ఈ సినిమాను సినీ సెల‌బ్రిటీలు సైతం చూసి అద్భుత‌మంటూ చిత్ర యూనిట్‌ను అభినందిస్తున్నారు. ఈమధ్యనే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ చిత్ర యూనిట్‌ను ప్ర‌త్యేకంగా క‌లిసి విషెష్ అందించారు. ఇప్పుడు అదే దారిలో తండేల్ హీరో యువ సామ్రాట్ అక్కినేని నాగ చైత‌న్య, వర్స‌టైల్ హీరోయిన్ సాయి ప‌ల్ల‌వి ఈ సినిమాను ప్ర‌త్యేకంగా వీక్షించి చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఈ కార్య‌క్ర‌మంలో నాగ చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి, నిర్మాత బ‌న్నీ వాస్‌, ద‌ర్శ‌కుడు అంజి కె.మ‌ణిపుత్ర‌, అంకిత్ కొయ్య‌, రాజ్ కుమాస్ క‌సిరెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

తొలి ఆట నుంచి మంచి మౌత్ టాక్ తో వరుసగా షోలు, స్క్రీన్లు పెరుగుతూ వస్తున్నాయి. ఈ సినిమా చూసి ఓ చక్కని సినిమాను చూశామనే ఫీలింగ్‌తో జనాలు బయటకు వస్తున్నారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న ఈ ఆధారణపై చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది. మొదటి రోజు అరవై లక్షల గ్రాస్ వస్తే.. నాలుగో రోజుకి 2.2కోట్ల గ్రాస్ వచ్చింది. తొలిరోజుతో పోల్చితే మూడు వందల రెట్లు ఎక్కువగా వసూళ్లు వచ్చాయి. ఇలా రోజు రోజుకి సినిమా క‌లెక్ష‌న్స్ పెరుగుతుందంటే సినిమాకు ఉన్న ఆద‌ర‌ణేంటో అర్థం చేసుకోవ‌చ్చు.

ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీ వాస్‌, విద్యా కొప్పినీడి నిర్మాత‌లుగా గోదావరి బ్యాక్ డ్రాప్‌లో ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఆయ్ చిత్రం రూపొందింది. అంజి కె.మ‌ణిపుత్ర ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా పరిచ‌యం అయ్యారు.