విక్రమ్ ఎంత కష్టపడ్డారో.. అందుకేనేమో..
కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నటించిన తంగలాన్ మూవీ ఇటీవల రిలీజైన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 18 Aug 2024 12:29 PM GMTకోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నటించిన తంగలాన్ మూవీ ఇటీవల రిలీజైన విషయం తెలిసిందే. స్టార్ డైరెక్టర్ పా.రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. విక్రమ్ కెరీర్ లో మరో ప్రయోగాత్మక చిత్రంగా నిలిచింది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన తంగలాన్ మూవీ.. ఇండిపెండెన్స్ కానుకగా ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజైన ఫస్ట్ షో నుంచి మంచి టాక్ దక్కించుకుని తెలుగు రాష్ట్రాల్లో కూడా దూసుకుపోతోంది.
ఐదో శతాబ్దంలో బంగారు నిక్షేపాల అన్వేషణ కోసం గిరిజన తెగలను భూస్వాములు, బ్రిటిష్ ప్రభుత్వం ఎలాంటి క్రూరమైన వివక్ష చూపించిందనే పాయింట్ తో తంగలాన్ చిత్రాన్ని అద్భుతంగా రూపొందించారు మేకర్స్. ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను సుమారు రూ. 140 కోట్ల రూపాయల వ్యయంతో తెరకెక్కించారు. ఇప్పటి వరకు తంగలాన్ మూవీ రూ.42 కోట్లకు పైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది.
ఇక మేకర్స్.. తాజాగా తంగలాన్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. వీడియోలో సినిమా కోసం హీరో విక్రమ్ పడ్డ కష్టాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు. మేకప్, అవుట్ డోర్ లొకేషన్స్.. అలా మూవీ కోసం విక్రమ్ బాగా కష్ట పడినట్లు ఈజీగా అర్థమవుతుంది. సినిమా టీమ్ కూడా.. షూటింగ్ కోసం కొండలు ఎక్కినట్లు చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుకే వచ్చిందని చెబుతున్నారు నెటిజన్లు.
అయితే ఈ సినిమాలో విక్రమ్, మాళవిక మోహనన్ యాక్టింగ్ కు అంతా ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా తంగలాన్ కోసం విక్రమ్ ను తనను తాను మేకోవర్ చేసుకున్న తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాలి. పూర్తి డీ గ్లామరస్ రోల్ లో కనిపిస్తూ ఒంటిపై కేవలం గోచీతో అచ్చమైన ఆదివాసిలా ఆయన పలికించిన హావభావాలు ఎవరినైనా కట్టిపడేస్తాయి. మాళవిక తన లుక్స్ తో అందరినీ ఆకట్టుకుంటోంది. ఆమె స్క్రీన్ ప్రజెన్స్ ప్రేక్షకుల్ని కచ్చితంగా భయపెడుతుంది.
సినిమా అంతా సాంకేతికంగా చాలా విషయాల్లో ఫుల్ స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. కాస్ట్యూమ్స్, మేకప్, ఆర్ట్స్ డిపార్ట్మెంట్స్ తంగలాన్ మూవీ కోసం ప్రాణం పెట్టి పని చేశాయని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. స్టోరీకి తగట్టు జీవీ ప్రకాష్ కుమార్ అందించిన మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఓవరాల్ గా తంగలాన్ ను ఓ విజువల్ వండర్ లా చూపించేందుకు ప్రయత్నం చేశారు దర్శకుడు పా.రంజిత్. మరి తంగలాన్ సినిమా ను మీరు చూశారా? లేదా?