Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాలలో తంగలాన్ కి ఊహించని హైప్

చియాన్ విక్రమ్ పా.రంజిత్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకొచ్చిన తంగలాన్ మూవీ థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది.

By:  Tupaki Desk   |   23 Aug 2024 9:22 AM GMT
తెలుగు రాష్ట్రాలలో తంగలాన్ కి ఊహించని హైప్
X

చియాన్ విక్రమ్ పా.రంజిత్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకొచ్చిన తంగలాన్ మూవీ థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. ఈ సినిమాకి ఒక వర్గం నుంచి ప్రశంసలు లభిస్తూ ఉంటే మరో వర్గం నుంచి మిక్స్ డ్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా కొన్ని విషయాల్లో తంగలాన్ ఓ వర్గం వారి మనోభావాలని దెబ్బ తీసినట్లు చెబుతున్నారు. అయితే పా రంజిత్ కులరహిత సమాజం కోసం పరితపించే వ్యక్తి కావడంతో ఆయన కథలలో కూడా సమాజంలో ఉన్న అంటరానితనంపై పోరాటం చేస్తాడని అంటున్నారు.


ఇదిలా ఉంటే ఈ సినిమాలో చియాన్ విక్రమ్ పెర్ఫార్మెన్స్ కి మాత్రం ప్రజల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. అద్భుతమైన నటనతో అందరిని ఆకట్టుకున్నారని కొనియాడుతున్నారు. శివపుత్రుడు తర్వాత ఆ స్థాయిలో విక్రమ్ పెర్ఫార్మెన్స్ తంగలాన్ సినిమాలోనే ఉందనే మాట సినీ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. ఈ సినిమాకి నెమ్మదిగా పబ్లిక్ లో ఆదరణ పెరుగుతుందని తెలుస్తోంది.

తాజాగా చిత్ర యూనిట్ కూడా తంగలాన్ సినిమాకి ప్రేక్షకాదరణ పెరిగిందని చెబుతూ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో మొదటి వారం కంటే రెండో వారానికి ఏకంగా 141 థియేటర్స్ పెరిగాయని పేర్కొన్నారు. దీనిని బట్టి తెలుగు రాష్ట్రాలలో సినిమాకి పబ్లిక్ నుంచి ఎలాంటి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందో అంచనా వేసుకోవచ్చని అంటున్నారు. మొదటి వారం తంగలాన్ మూవీ 251 థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది.

రెండో వారం నాటికి ఆ సంఖ్య 391కి పెరిగింది. తెలుగు రాష్ట్రాలలో ఉన్న డిమాండ్ నేపథ్యంలోనే థియేటర్స్ సంఖ్య పెంచినట్లు టాక్ వినిపిస్తోంది. తంగలాన్ గోల్డెన్ రన్ తో థియేటర్స్ లో కొనసాగుతుందని చిత్ర యూనిట్ ట్విట్టర్ లో పేర్కొంది. ఈ సినిమాకి జీవీ ప్రకాష్ కుమార్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగా ప్లస్ అయ్యిందనే మాట వినిపిస్తోంది. అలాగే విక్రమ్, మాళవిక మోహనన్ పెర్ఫార్మెన్స్ కూడా అదనపు ఆకర్షణగా నిలిచింది.

వీటన్నింటికి తోడు పీరియాడిక్ జోనర్ విజువలైజేషన్, పా రంజిత్ కథని ప్రెజెంట్ చేసిన విధానం కూడా సామాన్య ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యిందనే ప్రచారం నడుస్తోంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో హిట్ టాక్ దిశగా దూసుకెళ్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. సినిమాకి పెరిగిన ఆదరణ నేపథ్యంలో త్వరలో బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ అందుకుంటుందని భావిస్తున్నారు.