షాకింగ్.. ఆ సినిమాకు ఎలాంటి కత్తెర పడలేదట!
తంగలన్ సినిమాకు సెన్సార్ బోర్డ్ నుంచి U/A సర్టిఫికేట్ దక్కింది. గ్రామీన ప్రాంతంలో జరిగే హారర్ థ్రిల్లర్ కథతో ఈ సినిమా సాగుతుందని మేకర్స్ చెబుతున్నారు.
By: Tupaki Desk | 30 July 2024 8:44 AM GMTవిక్రమ్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో రూపొందిన 'తంగలన్' సినిమా విడుదల కోసం తమిళ ప్రేక్షకులతో పాటు పాన్ ఇండియా స్థాయి సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. షూటింగ్ పూర్తి అయ్యి చాలా రోజులు అయినా కూడా కొన్ని కారణాల వల్ల విడుదల వాయిదా వేస్తూ వచ్చారు.
ఎట్టకేలకు ఈ సినిమాను ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. టీజర్ మరియు ట్రైలర్ లో ఉన్న కంటెంట్ ను చూసి అంతా కూడా హింస ఎక్కువ ఉండటం ఖాయం అని అంతా అనుకున్నారు.
సెన్సార్ బోర్డ్ ముందుకు ఈ సినిమా వెళ్తే చాలా కట్స్ తప్పవని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఈ సినిమా కి సెన్సార్ బోర్డ్ నుంచి కట్స్ ఏమీ లేకుండానే క్లియరెన్స్ దక్కింది. కొన్ని డైలాగ్స్ ను మ్యూట్ చేయడంతో పాటు, కొన్ని షాట్స్ లో బ్లర్ చేసి ఎలాంటి కట్స్ లేకుండా సెన్సార్ పూర్తి చేయడం జరిగింది.
తంగలన్ సినిమాకు సెన్సార్ బోర్డ్ నుంచి U/A సర్టిఫికేట్ దక్కింది. గ్రామీన ప్రాంతంలో జరిగే హారర్ థ్రిల్లర్ కథతో ఈ సినిమా సాగుతుందని మేకర్స్ చెబుతున్నారు. విక్రమ్ ను సరికొత్త అవతారంలో ఈ సినిమాలో చూడబోతున్నట్లు ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్ చెప్పకనే చెబుతున్నాయి.
మాళవిక మోహనన్ మరియు పార్వతి తిరువోతు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాను స్టూడియో గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ పతకంపై జ్ఞానవేల్ నిర్మించాడు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీగా వసూళ్లు దక్కించుకోవడం ఖాయం అనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు.