Begin typing your search above and press return to search.

విక్రమ్ 'తంగలాన్' ట్రైలర్.. మరోసారి ప్రాణం పెట్టేశారు!

కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ లో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

By:  Tupaki Desk   |   10 July 2024 2:00 PM GMT
విక్రమ్ తంగలాన్ ట్రైలర్.. మరోసారి ప్రాణం పెట్టేశారు!
X

అటు కోలీవుడ్.. ఇటు టాలీవుడ్ లో హీరో విక్రమ్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిన విషయమే. ఆయన సెలెక్ట్ చేసుకున్న రోల్స్ చాలా వైవిధ్యంగా ఉంటాయి. అంతే రీతిలో హార్డ్ వర్క్ కూడా చేస్తారు విక్రమ్. అయితే ఈ మధ్య కాలంలో ఆయన ఒక్క కమర్షియల్ హిట్ కూడా కొట్టలేకపోయారు. దీంతో తన అప్ కమింగ్ మూవీ తంగలాన్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు. స్టార్ట్ డైరెక్టర్ రంజిత్ పా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రిలీజ్ కు సిద్ధమవుతోంది.


కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ లో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా రానున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన నాటి నుంచే మంచి హైప్ నెలకొంది. తంగలాన్ సినిమా కోసం హీరో విక్రమ్ ఎంతగానో హార్డ్ వర్క్ చేశారని సమాచారం. కేవలం మూవీ కోసం చాలా బరువు తగ్గారు. ఒక అటవిక తెగకు చెందిన వ్యక్తిగా విక్రమ్‌ చాలా వైవిధ్యంగా కనిపించనున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ సూపర్ రెస్పాన్స్ అందుకుంది. అదే జోష్ తో తాజాగా మేకర్స్ ట్రైలర్ ను విడుదల చేశారు. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేశారు. 2 నిమిషాల 10 సెకన్ల నిడివితో ఉన్న ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది. కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ నేపథ్యంలో సాగుతున్న ట్రైలర్.. మూవీపై ఆసక్తి పెంచుతోంది.

అయితే సినిమాలో విక్రమ్ మరోసారి అదరగొట్టేశారని.. ట్రైలర్ ద్వారా అర్థమవుతుంది. డిఫరెంట్ గెటప్ లో విశ్వరూపం చూపించారు విక్రమ్. తన యాక్టింగ్ తో దుమ్ముదులిపేశారు. మరోసారి సినిమా కోసం ఆయన ప్రాణం పెట్టారని తెలుస్తుంది. విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. ఆడియన్స్ ను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లాయి. రంజిత్ మార్క్ క్లియర్ గా కనిపిస్తోంది. జీవీ ప్రకాష్ బ్యాక్‍ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది.

ఇక ఈ మూవీ విషయానికొస్తే.. స్టూడియో గ్రీన్ ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్‌ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పార్వతి తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పశుపతి, డానియెల్‌ కల్టగిరోన్‌ తో పాటు పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరి విక్రమ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో.. ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.