క్రేజీ సీక్వెల్ పై డైరెక్టర్ హింట్
ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు తరుణ్ భాస్కర్ కీలక అప్డేట్ ఇచ్చాడు.
By: Tupaki Desk | 19 March 2025 1:58 PM ISTవిశ్వక్ సేన్ హీరోగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన కల్ట్ సినిమా ఈ నగరానికి ఏమైంది. సింపుల్ కథతో, యూత్ ను ఎట్రాక్ట్ చేసేలా తరుణ్ భాస్కర్ ఈ సినిమాను తెరకెక్కించాడు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. మొదట్లో ఈ సినిమాకు పెద్దగా ఆడియన్స్ కనెక్ట్ అవలేదు కానీ తర్వాత మీమ్స్ వల్ల ఈ నగరానికి ఏమైంది బాగా ఫేమస్ అయింది.
విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను, సుశాంత్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సపరేట్ ఫ్యాన్స్ బేస్ కూడా ఏర్పడింది. సోషల్ మీడియా ద్వారా బాగా పాపులరైన ఈ సినిమాకు సీక్వెల్ కావాలని ఫ్యాన్స్ ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తున్నారు. తరుణ్ భాస్కర్ కూడా చేస్తానంటున్నాడు తప్పించి ఇప్పటివరకు ఎప్పుడనేది క్లారిటీ ఇవ్వడం లేదు.
ఈ నగరానికి ఏమైంది సక్సెస్, క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని తరుణ్ భాస్కర్ ఈ సినిమాను తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. ఈ కామెడీ ఎంటర్టైనర్ సీక్వెల్ పై అందరికీ భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా కూడా యూత్ ను టార్గెట్ చేస్తూనే తరుణ్ తెరకెక్కించనున్నట్టు సమాచారం. ఆల్రెడీ దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తైందని తరుణ్ సన్నిహితులు చెప్తున్నారు.
ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు తరుణ్ భాస్కర్ కీలక అప్డేట్ ఇచ్చాడు. ఈ నగరానికి ఏమైంది సినిమాకు సీక్వెల్ చేయబోతున్నట్టు హింట్ ఇచ్చాడు. అందులో భాగంగానే తరుణ్ ఇన్‌స్టాలో ఈ ఇయర్ కొన్ని బాకీలను తీర్చాలని పోస్ట్ చేశాడు. దీంతో అందరూ ఆ పోస్ట్ ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ గురించేనని భావిస్తూ సోషల్ మీడియాలో తరుణ్ పోస్ట్ ను వైరల్ చేస్తున్నారు.