ఆ హిందీ స్టార్‌కి 'దేవర'తోనే ముప్పు?
2024లో కూడా అలాంటి మరొక సందర్భాన్ని మనం చూడబోతున్నామా? అంటే.. అవుననే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
By: Tupaki Desk | 19 Feb 2024 3:21 AM GMT2023లో కింగ్ ఖాన్ షారూఖ్ నటించిన 'డంకీ'తో పోటీపడుతూ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ విడుదలైంది. రేసులో సలార్ భారీ వసూళ్లతో డామినేషన్ కొనసాగించింది. 2024లో కూడా అలాంటి మరొక సందర్భాన్ని మనం చూడబోతున్నామా? అంటే.. అవుననే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఈసారి హిందీ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ ని ఆర్.ఆర్.ఆర్ స్టార్ ఎన్టీఆర్ ఢీకొట్టబోతున్నాడు.
10.10.2024 జూనియర్ ఎన్టీఆర్ లాక్ చేసిన డేట్. 'దేవర' అధికారిక రిలీజ్ తేదీ ప్రకటనతో అభిమానులు స్కైలో తేల్తున్నారు. ఎన్టీఆర్ 10 ఆన్ 10 ప్రకటన నిజానికి బాలీవుడ్ లోను వేవ్స్ క్రియేట్ చేసింది. ఇప్పటికే RRR నటుడిగా తారక్ ఇమేజ్ స్కైలో ఉంది. అతడు త్వరలో హృతిక్ ని ఢీకొట్టే విలన్‌గా వార్ 2లో కనిపించబోతుండడంతో అది మరింతగా ఉత్కంఠను కలిగిస్తోంది. దేవరలో జాన్వీ కపూర్ కథానాయికగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తుండడంతో ఈ భారీ మల్టీస్టారర్ కి ప్రతిదీ అదనపు ఆకర్షణగా మారింది.
ఇప్పటికే విడుదలైన దేవర సినిమా టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ఎట్టకేలకు దసరా వీకెండ్‌కి రిలీజ్ డేట్ లాక్ అయింది. విజయదశమి పండుగ ఈ సంవత్సరం అక్టోబర్ 12 న జరగనుంది. రెండు రోజుల ముందు విడుదలయ్యే దేవర దసరా సెలవులను పూర్తి స్థాయిలో ఎన్ క్యాష్ చేసుకుంటుందనడంలో సందేహం లేదు.
అయితే `దేవర`కు హిందీ బాక్సాఫీస్ వద్ద పోటీ అన్నదే లేదా? .. ఆరా తీస్తే చాలా ఆసక్తికర విషయాలు తెలిసాయి. పాన్ ఇండియా చిత్రం దేవర అక్టోబర్ 10న విడుదలవుతుండగా మరే ఇతర పెద్ద హిందీ విడుదల అదే రోజు లేదు. అయితే ప్రస్తుతం షాహిద్ కపూర్ నటిస్తున్న- దేవా ..హిమేష్ రేషమియా - బాదాస్ రవికుమార్ చిత్రాల రిలీజ్ తేదీల్ని దసరా బరిలోనే లాక్ చేసారు. రెండు సినిమాలు చెప్పిన తేదీకి విడుదల కావచ్చు లేదా విడుదల కాకపోవచ్చు. కానీ ఈ రెండు సినిమాలతో పోటీ దేవరకు పెద్దగా నష్టాన్ని తీసుకురాదు.
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ నటిస్తున్న స్కై ఫోర్స్ ని దసరా వీకెండ్ లోనే రిలీజ్ చేస్తుండడం కొంత ఆలోచించదగిన పరిణామంగా మారంది. ఒకే వారంలో ఇద్దరు క్రేజీ స్టార్ల సినిమాలు విడుదలవుతుండడం నిజంగా బాక్సాఫీస్ వద్ద ఇరువురికి నష్టం కలిగించేదేనని విశ్లేషిస్తున్నారు. నిజానికి ఇది పాక్షిక ఘర్షణకు దారితీస్తోంది. అక్షయ్ కుమార్ స్కై ఫోర్స్ (తాత్కాలిక టైటిల్) అక్టోబర్ 2న విడుదలవుతోంది. అంటే దేవర కంటే ఎనిమిది రోజుల ముందు విడుదలకు వస్తోంది. దీనివల్ల చాలా వరకూ ఓపెనింగులపై ప్రభావం ఉండదు. తొలి వారం అక్షయ్ సినిమాకి ఎలాంటి ఢోఖా ఉండదు.
ఓవైపు ఖిలాడీ అక్షయ్ కుమార్ నుంచి భారీ విజయాన్ని చూడాలని ఆశిస్తున్న అభిమానులు.. మరోవైపు దేవరతో పాన్ ఇండియాలో సంచలనం సృష్టించాలని చూస్తున్న తారక్ అభిమానులు... దీంతో బాక్సాఫీస్ వద్ద వార్ గురించి విస్త్రతంగా చర్చ సాగుతోంది. RRR తర్వాత ఎన్టీఆర్ అభిమానులు చాలా ఓపిగ్గా వేచి చూస్తున్నందున దేవర బ్లాక్ బస్టర్ కావాలనే పంతం కనిపిస్తోంది.
కానీ అక్షయ్ కుమార్ 'స్కై ఫోర్స్' అనూహ్యంగా నమ్మశక్యం కాని మ్యాజిక్‌ను సృష్టిస్తే అప్పుడు దాని ప్రభావం దేవరపై కొంతమేర పడుతుంది. కానీ 'దేవర' థియేటర్లలో విడుదలయ్యాక స్కై ఫోర్స్ తన బాక్సాఫీస్ పనితీరుతో అలరించాల్సి ఉంటుంది. దేవరకు ధీటుగా వసూళ్లతో అడ్డుకట్ట వేయగలగాలి. ఈ పాక్షిక ఘర్షణ జరగకుండా ఉండే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నా కానీ, అభిమానుల్లో దీనిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ రెండు సినిమాలు అత్యుత్తమ కంటెంట్ తో బ్యాలెన్స్‌ని సాధించి, తమ వర్గం ప్రేక్షకులను అలరించేలా ఉన్నాయా అనేది చూడాలి.